రాయలను ఆదర్శంగా తీసుకోవాలి: పల్లె
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:13 AM
బుక్కపట్నం, డిసెంబరు 25: శ్రీకృష్ణదేవరాయలను రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మాజీ మంత్రిపల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు.
బుక్కపట్నం, డిసెంబరు 25: శ్రీకృష్ణదేవరాయలను రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మాజీ మంత్రిపల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి సోమవారం రాత్రి ఆయన పూలమాల వేశారు. అనంతరం మాట్లాడుతూ చరిత్ర గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలన్నారు. రాయలవారు తమ పాలనలో ప్రతి గ్రామంలోనూ చెరువులు తవ్వించారని, పాఠశాలలు, ఆలయాలు కట్టించారని గుర్తు చేవారు. రాయలవారి పాలనను నేటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. 2018లో తాను ఇక్కడ రాయలవారి విగ్రహానికి స్థలం మంజూరు చేయించానని, దాదాపు రూ.12లక్షలను చందాల రూపంలో విరాళాలు సేకరించానని గుర్తు చేశారు. అనంతరం బలిజ సంఘం నాయకులు పల్లెను సన్మానించారు. కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, మాజీ సర్పంచ సాకే యశోద, సంఘం నాయకులు సంజీవరాయుడు, ఈశ్వరప్ప, గోపాల్, వెంకటరాముడు, బాలాజీ పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 12:13 AM