ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అయ్యో.. అమ్మ..!

ABN, First Publish Date - 2023-12-04T00:57:55+05:30

గుత్తి పట్టణంలోని గాంధీనగర్‌లో మహమ్మద్‌ బాషా, కుళ్లాయమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. బాషా భవన నిర్మాణ పనులతోపాటు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు.

బిడ్డ మృతదేహాన్ని భుజాన వేసుకుని, ఆస్పత్రి ఆవరణలో తిరుగుతున్న తల్లి కుళ్లాయమ్మ

ఆ ఇంటి గారాలపట్టి..

ఆటోలో ఆనందంగా పయనమైంది..

అప్పటి వరకు మాటలు చెప్పింది..

అవ్వ ఇంటికి వెళ్తున్నందుకు

ఆనందపడింది..

ఇంకాసేపట్లో గమ్యం చేరాల్సి ఉంది..

ఇంతలోనే.. ఆ బిడ్డ జారిపోయింది..

రోడ్డుపై పడిపోయింది..

పరుగుపరుగున ఆస్పత్రికి తీసుకెళ్తే..

ఆ బిడ్డ ఇకలేదని డాక్టర్లు చెప్పేశారు..

ఎలా.. ఇదెలా..

అప్పటిదాకా ఆడిన బిడ్డ ఎలా చనిపోతుంది?

లేదు.. చనిపోలేదు..

చనిపోయిందనడం అబద్ధం..

బతికే ఉంది.. నా పాప బతికే ఉంది..

తలకు చిన్న గాయమైంది అంతే..

లే.. తల్లీ.. లే..

పెద్దాస్పత్రికెళ్దాం.. లేమ్మా.. లే..

అంటూ ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది..

బిడ్డ చనిపోయిందంటే నమ్మలేకపోయింది..

బిడ్డ శవాన్ని భుజాన వేసుకుని..

తన బిడ్డ బతికే ఉందంటూ..

ఆస్పత్రి అంతా తిరుగుతూ..

అందరినీ కన్నీళ్లు పెట్టించింది..

గుత్తి పట్టణంలోని గాంధీనగర్‌లో మహమ్మద్‌ బాషా, కుళ్లాయమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. బాషా భవన నిర్మాణ పనులతోపాటు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. ప్రతి ఆదివారం పెద్దవడుగూరు మండలం వెంకటాంపల్లిలోని తల్లిదండ్రుల వద్దకు కుటుంబంతో వెళ్లి వస్తుండేవాడు. అందులో భాగంగా ఆదివారం కూడా భార్య, కుమార్తె ఆలియా (8)తో కలిసి తన ఆటోలో బాషా వెంకటాంపల్లికి బయల్దేరాడు. కాసేపట్లో గమ్యం చేరాల్సి ఉంది. ఇంతలోనే గుత్తి మండలం కొత్తపేట గ్రామ శివారులో ఆటోలో తండ్రి పక్కన కూర్చున్న ఆలియా జారి కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆలియాను వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అంతవరకు తమతో కబుర్లు చెప్పిన ఆలియా ఇక లేదన్న చేదునిజాన్ని ఆ తల్లి గుండె తట్టుకోలేకపోయింది. తన బిడ్డకు ఏమీ కాలేదనీ, తలకు చిన్న గాయం మాత్రం అయిందనీ, పెద్దాస్పత్రికి వెళ్దామంటూ ఆలియాను భుజాన ఎత్తుకుని, ఆస్పత్రి ఆవరణలో కలియతిరగడం కన్నీళ్లు తెప్పించింది. ఆ తల్లిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. కుటుంబికులు, బంధువులు, చివరికి పోలీసులు చెప్పినా ఆ తల్లి మనసు నమ్మలేదు. గుండెలవిసేలా రోదించింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

-గుత్తిరూరల్‌

Updated Date - 2023-12-04T00:57:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising