ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యువగళం సభకు తరలిరండి: సవిత

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:06 AM

ఇప్పుడున్న రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు చేసే నాయకులను దీటుగా ఎదుర్కొనే నికార్సయిన నాయకుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ అని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత అన్నారు.

మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత

పెనుకొండ టౌన, డిసెంబరు 17: ఇప్పుడున్న రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు చేసే నాయకులను దీటుగా ఎదుర్కొనే నికార్సయిన నాయకుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ అని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత అన్నారు. ఆమె ఆదివారం తన స్థానిక కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద ర్భంగా సవిత మాట్లాడుతూ... నారా లోకేశ చేపట్టిన యువగళం ముగింపు బహిరంగసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యువగళం పాదయాత్ర ముగింపు సభను ఈనెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యేడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర ఈనెలతో ముగియ నుందన్నారు. జనసేన, టీడీపీ నాయకులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. యువగళం పాదయాత్రను అడ్డుకునేందు కు అధికార పార్టీ వైసీపీ నాయకులు రకరకాల విన్యాసాలు చేశారన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి అసమర్థ పాలనపై నారా లోకేశ పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు గళం విప్పారన్నారు. ఏది ఏమైనా లోకేశ పాదయాత్రకు వస్తున్న జనాదరణ చూసి వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు సూరి, ప్రసాద్‌, వైస్‌ సర్పంచ సుబ్రహణ్యం, త్రివేంద్ర, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:06 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising