వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:54 PM
వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకంమధుసూదన రెడ్డి పిలుపునిచ్చారు.
ముదిగుబ్బ, డిశెంబర్ 14: వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకంమధుసూదన రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం, సిద్దనగారిపల్లి, బ్రహ్మదేవమర్రి, గంగిరెడ్డిపల్లి, కొడవండ్లపల్లి, భూదనంపల్లి గ్రామాలలో ఆయన పర్యటించారు. జనసేన, టీడీపీ నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలు అడిగితెలుసురున్నారు. పలువురు వృద్ధులు పింఛన రాలేదని, గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీ లేవని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. జనసేన, టీడీపీ అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జనసేన మండల కన్వీనర్ గుర్రం జయచంద్ర, రాజారెడ్డి, హరికృష్ణ, మధు, గోవిందు, ధనకర్, టీడీపీ నాయకులు రాజేష్, గురుప్రసాద్, ఆది, భార్గవ్, హరీష్, పోతలయ్య పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 11:54 PM