ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా ఉద్యమిద్దాం

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:23 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా ఉద్యమిద్దామని ఎస్‌యూసీఐ(సీ) జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర పిలుపునిచ్చారు.

నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న ఎస్‌యూసీఐ నాయకులు

అనంతపురం కల్చరల్‌, డిసెంబరు 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా ఉద్యమిద్దామని ఎస్‌యూసీఐ(సీ) జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం ఎస్‌యూసీఐ(సీ) ఆధ్వర్యంలో ఆర్ట్స్‌ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. రాఘవేంద్ర మాట్లాడుతూ... ప్రజా సమస్యలను పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, వాటిపై ఉద్యమాలు చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కపాదంతో వాటిని అణచివేస్తుండడం దుర్మార్గమ న్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వివిధ రకాల పేర్లతో విద్యుత చార్జీలను పెంచి ప్రజలమీద భారం వేస్తున్నారని, స్మార్ట్‌ మీటర్ల బిగింపును ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు వల్ల రైతులు తీవ్రంగా పంటలు నష్టపోయారని, అయితే వీరికి నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పబ్లిక్‌ రంగ సెక్టార్లను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తోందని, ఆ విధంగా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ప్రాకులాడు తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమిం చాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌యూసీఐ(సీ) నాయకులు లలిత, సుబ్రహ్మణ్యం, తబ్రేజ్‌, నాగరాజు, కిషోర్‌, మహేష్‌ నాగేంద్ర, సురేష్‌, వివిధ రంగాల కార్మికులు, రైతులు, యువత పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:23 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising