ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీతోనే కురుబలకు అన్నివిధాలా న్యాయం

ABN, Publish Date - Dec 31 , 2023 | 11:35 PM

కురుబ కులస్థులకు రాజకీయంగానే కాకుండా అన్నివిధాలుగా టీడీపీతోనే న్యాయం జరిగిందనా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత అన్నారు. పట్టణంలోని తన కార్యాలయంలో ఆమె టీడీపీ శ్రేణులతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న సవిత

పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత

పెనుకొండ టౌన, డిసెంబరు 31: కురుబ కులస్థులకు రాజకీయంగానే కాకుండా అన్నివిధాలుగా టీడీపీతోనే న్యాయం జరిగిందనా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత అన్నారు. పట్టణంలోని తన కార్యాలయంలో ఆమె టీడీపీ శ్రేణులతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ... వైసీపీ పేరుకు మాత్రమే కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటుచేసి, రూ.1 కూడా నిధులు కేటా యించలేదన్నారు. కుప్పంలో శనివారం కనకదాస విగ్రహావిష్కరణ కార్య క్రమంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా ట్లాడుతూ కురుబ కులస్థులను అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికే కురుబ కులాని చెందిన మహిళలను రాజకీ యంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చారని ఇందుకు నిదర్శనం తానేఅన్నారు. తనకు రాష్ట్ర కురుబ కార్పొరేషన చైర్‌పర్సన బాధ్యతలు ఇచ్చిన సంగతి తెలిసిందేనన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే కురుబలకు సబ్సిడీ రుణాలు, గొర్రెల కాపర్లకు ప్రమాదవశాత్తు మృతిచెందితే రూ.10 లక్షల బీమా, మేతకు భూములు కేటాయిస్తామని చంద్రబాబు అన్నార న్నారు. అలాగే కురుబ విద్యార్థులకు ట్రైనింగ్‌ సెంటరన్లు ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదిగేలా చేస్తామన్నారు. కురుబలు ఐక్యంగా ఉండి టీడీపీని గెలిపించుకుందామన్నారు. కార్యక్రమంలో మాధవనాయుడు, మాజీ మండల కన్వీనర్‌ ప్రసాద్‌, కౌన్సిలర్‌ గీతా హనుమంతు, రెడ్డివారి మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 11:35 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising