వైభవంగా కెంపేగౌడ జయంత్యుత్సవాలు
ABN, First Publish Date - 2023-12-10T23:58:53+05:30
అమరాపురం మండల కేంద్రంలో ఆదివారం కుంచిటిగ వక్కలిగ కులస్థుల ఆరాధ్య దైవమైన కెంపేగౌడ, బసవయ్య జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు.
మడకశిరటౌన, డిసెంబరు 10: అమరాపురం మండల కేంద్రంలో ఆదివారం కుంచిటిగ వక్కలిగ కులస్థుల ఆరాధ్య దైవమైన కెంపేగౌడ, బసవయ్య జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. మడకశిర నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచేకాకుండా కర్ణాటకలోని తుమకూరు, హిరియూరు, శిరా, పావగడ తదితర నియోజకవర్గాల నుంచి అనేక మంది వక్కలిగలు తరలివచ్చారు. కెంపేగౌడ జయంతి ఉత్సవం సం దర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సంస్కృతి సంప్రదా యాలను ప్రతిబింబించే విధంగా నిర్వహించారు. వేల మంది తరలిరా వడంతో అమరాపురం మండల కేంద్రం జనసంద్రంగా మారింది. కెంపేగౌడ, బసవయ్య చిత్రపటాలను ఊరేగించారు. మోటారు సైకిళ్లు, కాలినడకన ర్యాలీ నిర్వహించారు. అనేక మంది మహిళలు సైతం పాల్గొన్నారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమంలో కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వక్కలిగ సంఘం ముఖ్య నా యకులతోపాటు నియోజకవర్గం నలుమూలల నుంచి జనం తరలివచ్చారు.
Updated Date - 2023-12-10T23:58:55+05:30 IST