కాపును జైలుకు పంపిస్తా : కాలవ
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:59 PM
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయదుర్గం నియోజకవర్గం ఎ మ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి చేసిన అవినీతి చిట్టాను నిరూపించి తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే జైలుకు పంపిస్తానని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.
కాపును జైలుకు పంపిస్తా : కాలవ
కణేకల్లు, డిసెంబరు 26: ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయదుర్గం నియోజకవర్గం ఎ మ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి చేసిన అవినీతి చిట్టాను నిరూపించి తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే జైలుకు పంపిస్తానని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం మం డలంలోని హనకనహాళ్ గ్రామంలో ఆయన విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ తాను మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డానని కాపు రామచంద్రారెడ్డి అనంతపురంలో ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపణలు చేశాడన్నారు. వైసీపీ అధిష్టానం కాపుకు టిక్కెట్ నిరాకరించడంతో మతిభ్రమించి తనపై లేనిపోని ఆరోపణలు చేసి పార్టీ అధిష్టానంతో మార్కులు కొట్టేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. తాను ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైనా అవినీతి చేసినట్లు నిరూపించే సత్తా ఉంటే ఎప్పుడైనా విచారణకు సిద్ధమన్నారు. రాష్ట్రంలోని 151 ఎమ్మెల్యేలలో అవినీతి పరుడిగా కాపు రామచంద్రారెడ్డి అపఖ్యాతి తెచ్చుకుని వైసీపీ అధిష్టానంలో చులకన అయ్యాడన్నారు. ఆయన ఇక్కడ పోటీ చేస్తే వైసీపీకి డిపాజిట్లు కూడా రావని ఉద్దేశంతో పార్టీ అధిష్టానం వేరేవాళ్లకు టిక్కెట్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఒక వేళ కాపు రామచంద్రారెడ్డికే రాయదుర్గం టిక్కెట్ ఇస్తే తాను టీడీపీ తరపున 50 వేల మెజార్టీతో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. తనను స్థానికుడు కాడని కాపు రామచంద్రారెడ్డి ఆరోపణ చేస్తున్నాడని ఆయన ఇక్కడ స్థానికుడా అంటూ ప్రశ్నించారు. బళ్లారిలో ఉంటూ జీవనం సాగించే నువ్వు 25 ఏళ్ల క్రితం కేవలం రూ.3వేల జీతగాడివని తాను అప్పటికే ఎంపీగా ఉండి ఈ ప్రాంతవాసులకు సుపరిచితుడుగా ఉన్నానన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు రాయదుర్గం అభివృద్ధికి విశేషంగా కృషి చేశానన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు లాలెప్ప, ఆనంద్‌రాజ్, ఆది, వేలూరు మరియప్ప, కళేకుర్తి సుదర్శన, బీటీ రమేష్, ఎంపీటీసీ నరేంద్ర, షేక్‌ముజ్జు, బాయినేని నవీన, చాంద్‌బాషా, మారుతి, మాబుసాబ్, షేక్‌హుస్సేన, జయశీలారెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. విలేకరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి కాలవ
Updated Date - Dec 26 , 2023 | 11:59 PM