ఘనంగా కనకదాస విగ్రహావిష్కరణ
ABN, First Publish Date - 2023-12-10T23:55:57+05:30
కురుబల ఆరాధ్య దైవం భక్త కనకదాస విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని గోరంట్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
పెనుకొండ, డిసెంబరు 10 : కురుబల ఆరాధ్య దైవం భక్త కనకదాస విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని గోరంట్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథితో పాటు పలువురు నాయకులు కేటీ శ్రీధర్, కురుబ కృష్ణమూర్తి, నెమలివరం ఈశ్వరయ్య, చెన్నప్ప, డాక్టర్ గిరి, సోమశేఖర్, నాగరాజు, దేవానందం, శంకరప్ప, వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కనకదాస విగ్రహానికి పూలమాలలువేసి పూ జలు నిర్వహించారు. కురుబల ఐక్యత వర్ధిల్లాలి తదితర నినాదాలు చేశారు. కనకదాస తన సంగీతం ద్వారా బడుగు బలహీన వర్గాలను చైతన్య పరిచారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
Updated Date - 2023-12-10T23:55:59+05:30 IST