కన్నుల పండువగా కల్యాణోత్సవం
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:49 PM
పట్టణంలోని తగ్గుదేవాలయంలో అనంత గజ గరుడ లక్ష్మీనారాయణస్వామి కల్యాణోత్సవం ఆదివారం రాత్రి కన్నుల పండువగా జరిగింది.
పామిడి, డిసెంబరు 17: పట్టణంలోని తగ్గుదేవాలయంలో అనంత గజ గరుడ లక్ష్మీనారాయణస్వామి కల్యాణోత్సవం ఆదివారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని స్వామి వారి మూలవిరాట్‌కు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు విశ్వనాథశర్మ వేదమంత్రోచ్ఛారణల నడుమ శ్రీదేవి, భూదేవి సహిత అనంత గజ గరుడ లక్ష్మీనారాయణస్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం అమ్మవార్లు, స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో కొలువుదీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. ప్రతి ఏడాది మార్గశిర మాసం తొలి ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని వేదపండితులు అనుంపల్లి భాస్కరరావు తెలిపారు.
Updated Date - Dec 17 , 2023 | 11:49 PM