ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లోకాన్ని రక్షిస్తున్న జగన్మాత

ABN, First Publish Date - 2023-11-06T00:01:17+05:30

రాశీభూతమైన కారుణ్యంతో సృష్టి, స్థితి, లయచేస్తూ జగన్మాత లోకాన్ని రక్షిస్తోందని ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్‌ చాగంటి కోటేశ్వరరావు అన్నారు

ప్రసంగిస్తున్న ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు

కన్నతల్లి రుణం తీర్చుకోలేనిది

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు

అనంతపురం సెంట్రల్‌, నవంబరు 5: రాశీభూతమైన కారుణ్యంతో సృష్టి, స్థితి, లయచేస్తూ జగన్మాత లోకాన్ని రక్షిస్తోందని ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్‌ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. జేఎనటీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన ’మాతృ చతుష్టయం’పై ప్రవచన కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా చాగంటి మాట్లాడుతూ కన్నతల్లిప్రేమ దైవంతో సమానమని, ఆమె రుణం తీర్చుకోలేనిదన్నారు. శ్రీరామచంద్ర మూర్తి నుంచి వివేకానందస్వామి, అబ్దుల్‌ కలాం వరకు ఎందరో మహానుభావుల జీవితాలను తీర్చిదిద్దింది వారి మాతృమూర్తులేనన్నారు. శంకరభగవత్పాదులు, రమణ మహర్షి వంటి గొప్పగురువులు సన్యాసాశ్రమం స్వీకరించినా చివరివరకూ వారి తల్లులను గౌరవంతో సమాదరించారన్నారు. సంస్కృతి పరిరక్షణ ద్వారా ఆధ్యాత్మికత, మానవీయ సంబంధాలు, శాంతి సామరస్యాలు బలపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలచేత వారి తల్లులకు పాదపూజ చేయించిన చాగంటి, అనంతరం తల్లిప్రేమ గురించి వివరించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-06T00:03:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising