నిరుద్యోగులను మోసం చేసిన జగన
ABN, First Publish Date - 2023-12-11T00:17:34+05:30
నిరుద్యోగులను సీఎం జగన మోసం చేస్తున్నాడని తెలుగు యువత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు యువత నాయకుల ఆగ్రహం
ఓబుళదేవరచెరువు, డిసెంబరు 10: నిరుద్యోగులను సీఎం జగన మోసం చేస్తున్నాడని తెలుగు యువత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలకేంద్రంలో తెలుగుయువత నియోజకవర్గ అధ్యక్షుడు బూదిలి ఓబులరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి అంబులెన్స రమేష్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి గడిచిన నాలుగేళ్లలో ఒక్కటి కూడా విడుదల చేయలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిరుద్యోగులపై ప్రేమ ఉన్నట్లు గ్రూపు-1, గ్రూపు-2 ఉద్యోగాలను విడుదల చేస్తున్నామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని మాటలు చెప్పిన ముఖ్యమంత్రి గడిచిన నాలుగేళ్లలోవాటి ఊసే లేదన్నారు. చాలా మంది నిరుద్యోగులు ఉపాఽధిలేక పొట్ట చేతపట్టుకుని పొరుగురాష్ట్రాలకు వలసలు పోతున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేసి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మనోహర్, వైవీ మురళీ, బడా మహేశ్వర్‌రెడ్డి, మధుసూదనరెడ్డి, టైలర్ రామాంజులు, క్రిష్ణారెడ్డి, గాయత్రి, గిరినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2023-12-11T00:17:35+05:30 IST