ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మౌలిక సదుపాయాలు కల్పించాలి

ABN, First Publish Date - 2023-12-11T00:15:48+05:30

పట్టణ నివాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న రాంభూపాల్‌

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్‌

కదిరిఅర్బన, డిసెంబరు 10: పట్టణ నివాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని ఎన్జీవో హోమ్‌లో ఆ పార్టీ నిర్వహించిన శ్రీసత్యసాయి జిల్లా పట్టణ నివాస ప్రాంత కార్యకర్తల జిల్లా వర్క్‌షాపులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో పేదలు నివసించే ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు సౌకర్యాలు లేవన్నారు. చెత్త, నీటి పన్నుల పేరుతో ప్రజలపై భారాలో మోసే ప్రభుత్వాలకు కనీస సౌకర్యాలు కల్పించాలన్న చిత్తశుద్ధిలేదని విమర్శించారు. జగనన్న కాలనీల పేరుతో ఏర్పాటు చేస్తున్న నివాస ప్రాంతాల్లో విద్యుత, రోడ్డు సౌకర్యలు కల్పించలేదన్నారు. రానున్న రోజుల్లో అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటి కొళాయిలకు మీటర్లు పెట్టి డబ్బులు వసూలుచేయాలని దుర్మార్గమైన విధానానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు శ్రీకారం చుట్టనున్నాయన్నారు. ప్రజలకు ఉచితంగా అందించాల్సిన పౌర సేవలకు పన్నులు వసూలు చేయడం అన్యాయమన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి సంఘ సభ్యులు బడా సుబ్బిరెడ్డి, నాయకులు జీఎల్‌ నరసింహులు, జగన్మోహన, ముస్తాక్‌, రామమోహన, బాబ్‌జాన, శాంతిబాయి, గంగాధర్‌, వెంకటరాముడు, రమణ, బాబా పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T00:15:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising