భూనిర్వాసితులకు పునరావాసం కల్పించాలి
ABN, First Publish Date - 2023-11-30T23:59:15+05:30
మండలంలోని పాలసముద్రం వద్ద ఏర్పాటు అవుతున్న నాసిన, బెల్ కంపెనీల కోసం భూములిచ్చిన పేద రైతులకు పునారావాసం కల్పించాలని సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామనకు గురువారం వినతిపత్రం అందించారు.
సీపీఎం ఆధ్వర్యంలో కేంద్రమంత్రికి రైతుల విజ్ఞప్తి
గోరంట్ల, నవంబరు 30: మండలంలోని పాలసముద్రం వద్ద ఏర్పాటు అవుతున్న నాసిన, బెల్ కంపెనీల కోసం భూములిచ్చిన పేద రైతులకు పునారావాసం కల్పించాలని సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామనకు గురువారం వినతిపత్రం అందించారు. నాసిన అకాడమి సందర్శన కోసం పాల సముద్రం వచ్చిన కేంద్రమంత్రిని వారు కలిశారు. పాలసముద్రం, చిన్నబాబాయ్య పల్లెకు చెందిన దళిత పేద రైతులకు పరిహారం పంపిణీలో అన్యాయం జరిగిందన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పునారావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులనుంచి 11వందల ఎకరాలను ప్రభుత్వం బలవంతగా సేకరించి అరకొరగా నష్టపరిహారం చెల్లించదన్నారు. పలుకుబడి, ఉన్నతవర్గాల వారి కి ఎకరాకు రూ.పది లక్షలు చొప్పున పరిహారం ఇచ్చి, దళితులకు ద్రోహం చేసిందన్నారు. జీవనాధారమైన భూమిని కొల్పోయిన రైతులకు న్యాయం జరిగేలా తగిన ఆదేఽశాలు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్, ప్రధాన కార్యదర్శి పెద్దన్న, జిల్లా నాయకులు ప్రవీణ్, నారాయణ, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు హనుమయ్య, సీఐటీయూ నాయకులు కొండా వెంకటేష్, వెంకటేష్, భూనిర్వాసితరైతులు గంగమ్మ, వెంకటలక్ష్మ్మ, రమీజ, ఆంజప్ప తదితరులున్నారు.
Updated Date - 2023-11-30T23:59:16+05:30 IST