ఆశాలు, మున్సిపల్ కార్మికుల ఆందోళన
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:58 PM
తమ సమస్యలు పరిష్కరించాలంటూ మడకశిర నగర పంచాయతీ కార్యాలయం ఎదుట మంగళవారం ఆశా కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
మడకశిరటౌన, డిసెంబరు 26: తమ సమస్యలు పరిష్కరించాలంటూ మడకశిర నగర పంచాయతీ కార్యాలయం ఎదుట మంగళవారం ఆశా కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. టీఏ, డీఏ ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని, వెట్టి చాకిరీని ఆపాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. పరిభా రాన్ని తగ్గించాలని, కనీస వేతనాన్ని చెల్లించాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలనే పలు డిమాండ్లను నెరవేర్చాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. అనంతరం ఆశావర్కర్లు తహసీల్దార్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ ఆంజనేయులుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఆశా కార్యకర్తల యూనియన జిల్లా కార్యదర్శి సౌభాగ్య, మహాలక్ష్మి, సీఐటీయూ నాయకులు రామాంజనేయులు ఉన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 11:58 PM