హామీలు నెరవేర్చకుండా వేధింపులా?
ABN, Publish Date - Dec 17 , 2023 | 12:09 AM
గత ఎన్నికల్లో నీ లబ్ధి కోసం అంగనవాడీలు అడక్కుండానే వరాలిచ్చావే... ఇప్పుడు వారు రోడ్డెకి సమ్మె చేస్తున్నా వేధిస్తున్నావే... అంటూ సీఎం జగనను సీపీఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ ప్రశ్నించారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్
హిందూపురం అర్బన, డిసెంబరు 16: గత ఎన్నికల్లో నీ లబ్ధి కోసం అంగనవాడీలు అడక్కుండానే వరాలిచ్చావే... ఇప్పుడు వారు రోడ్డెకి సమ్మె చేస్తున్నా వేధిస్తున్నావే... అంటూ సీఎం జగనను సీపీఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ ప్రశ్నించారు. పట్టణంలో అంగనవాడీలు ఐదో రోజు చేపట్టిన సమ్మెకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని అంగనవాడీలు అడక్కుండానే పలు హామీలు ఇచ్చి నమ్మించావన్నారు. తన అక్క చెల్లెమ్మలు అన్న జగన ఒక సారి రోడ్డు మీదకు వచ్చి అంగనవాడీల గోడు వినాలన్నారు. ఎనజీఓలు, ఉపాధ్యాయులను అణచి వేశాననీ, అంగనవాడీలు మహిళలు కదా ఏం చేస్తార నుకోకన్నారు. జగన పతనం అంగనవాడీలతోనే అని ఆగ్ర హించారు. వై నాట్ అవర్ శాలరీ అంటూ ఎద్దేవా చేశారు. సమ్మె చేయకుండా ముందస్తుగా నోటీ సులు ఇవ్వడం, అధికారులతో అంగనవాడీ కేంద్రాలు తాళాలు పగుల కొట్టడం హే యమన్నారు. అన్ని ఉద్యోగ సంఘాల మద్దతుతో సోమ వారం నుంచి సమ్మె ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జడ్పీ శ్రీని వాసులు, రమణ, అంగన వాడీ కార్యదర్శి లావణ్య, సె క్టారు లీడర్లు నాగమ్మ, వి జయ, వందలాదిమంది అం గనవాడీలు పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 12:09 AM