ఘనంగా కార్తీక వనభోజనం
ABN, First Publish Date - 2023-12-11T00:10:02+05:30
శ్రీ కృష్ణదేవరాయ బలిజ సంఘం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం తాడిపత్రి రోడ్డులోని జేజే కాలనీ ఆవరణ లో కార్తీక మాస వనోభోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వ హించారు.
గుత్తి, డిసెంబరు 10: శ్రీ కృష్ణదేవరాయ బలిజ సంఘం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం తాడిపత్రి రోడ్డులోని జేజే కాలనీ ఆవరణ లో కార్తీక మాస వనోభోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వ హించారు. ముందుగా తాడిపత్రి రోడ్డు సర్కిల్‌లోని శ్రీ కృష్ణదేవరాయుల విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళుర్పించారు. అక్కడ నుంచి వనభోజన మహోత్సవానికి ర్యాలీగా వెళ్లారు. ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వన భోజన కార్య క్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు పగడాల వెంకటరమణ, అధ్యక్షుడు ఎం రమణ, ప్రధాన కార్యదర్శి రామానాయుడు, వెంకటేశ్వర్లు, మురళి, రమేష్, వాసగిరి మణికంఠ, గిరిధర్, పగడాల శ్రీనివాసులు, గోవిందరాజులు, మంజునాథ్, ప్రసాద్, వెంకటేశులు, చిరంజీవి, బాలరాజు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-11T00:10:04+05:30 IST