దుస్థితిలో ప్రభుత్వ వసతి గృహాలు
ABN, Publish Date - Dec 18 , 2023 | 11:46 PM
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విద్యార్థుల పాలిట కంసమామగా మారాడని జనసేన నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ వసతి గృహాల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతపురం ప్రెస్‌క్లబ్, డిసెంబరు 18: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విద్యార్థుల పాలిట కంసమామగా మారాడని జనసేన నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ వసతి గృహాల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీ నగర అధ్యక్షుడు పొదిలి బాబురావు, రాయలసీమ ప్రాంతీయ మహి ళా కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి, అంకె ఈశ్వ రయ్య, నాయకులతో కలిసి జూనియర్ కళాశాలలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని సోమవారం పరిశీలించారు. పొదిలి బాబురావు మాట్లాడుతూ... వసతి గృహంలో 300 మంది విద్యార్థులకు కేవలం ఆరు గదులే ఉన్నాయని, విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా మరుగుదొడ్లూలేవని ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నుంచి వచ్చే నీటిని హాస్టల్ ఆవరణంలో వదిలేయడంతో దుర్వాసన వస్తోందని, దీంతో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్పాహారం సరిగ్గా అందడం లేదని... అర్ధాకలితో అలమ టిస్తున్నామని విద్యార్థులు చెప్పడం చూస్తుం టే విద్యార్థుల పట్ల సీఎంకు ఏపాటి చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతోందన్నారు. తక్షణమే వసతిగృహాల్లో సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పించా లన్నారు. అనంతరం హాస్టల్‌లోని సమస్య లను బీసీ సంక్షేమశాఖ డీడీ కుష్బూకొతారీకి వివరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యద ర్శులు సిద్దు, రాపా ధనుంజయ, సంజీవ రాయుడు, కిరణ్‌కుమార్, అవుకు విజయ్ కుమార్, నాయకులు జక్కిరెడ్డి ఆదినారా యణ, మేదర వెంకటేష్, చక్రపాణి, హుస్సేన, దరాజ్ బాషా, లాల్‌స్వామి, కుమ్మర మురళీ, అంజి, సంపత, వెంకటరమణ, అశోక్, వీరమహిళలు అనసూయ, దాసరి సరిత, వర్షిత, అంజలి, అరుణ పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 11:46 PM