హామీలు నెరవేర్చేదాకా పోరు
ABN, Publish Date - Dec 18 , 2023 | 11:47 PM
చ్చిన హామీలు నెరవేర్చేవరకూ తాము ఆందోళనను విరమించబోమని అంగనవాడీలు తేల్చిచెప్పారు. వారు తలపెట్టిన నిరసన సోమవారం ఏడో రోజుకు చేరింది.
ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్ : ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకూ తాము ఆందోళనను విరమించబోమని అంగనవాడీలు తేల్చిచెప్పారు. వారు తలపెట్టిన నిరసన సోమవారం ఏడో రోజుకు చేరింది. గార్లదిన్నెలో వీరి ఆందోళనకు రైతు సంఘం, సీపీఎం, సీఐటీయూ నాయకులు మద్దతిచ్చారు. గార్లదిన్నె బస్టాండ్ సర్కిల్లో మానవ హారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సమ్మె చేపట్టారు. ఇందులో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు, సీపీఎం మండలాధ్యక్షుడు చెన్నారెడ్డి, సీఐటీయూ నాయకులు శ్రీనివాస్‌రావు, అంగనవాడీల ప్రాజెక్టు కోశాధికారి లీలావతి, గార్లదిన్నె, కల్లూరు సెక్టార్లు ఫిర్‌దోజ్‌బాను, రాజేశ్వరీ, ప్రమీల రాణి, శాంతకుమారి పాల్గొన్నారు. శింగనమల తహసీల్దార్ కార్యాల యం వద్ద అంగనవాడీలు చెవిలో పూలు పెట్టుకొని మోకాళ్ల మీద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ నాయకుడు భాస్కర్ ఆధ్యర్యంలో అంగనవాడీలు మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. నార్పలలో అంగన్వాడీల సమ్మెకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీల వర్కర్స్ యూనియన నాయకులు రామాంజినమ్మ, శ్రీదేవి, రేణుకా, లక్ష్మీదేవి పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 11:47 PM