ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆనలైనతో అన్నీ తలనొప్పులే..!

ABN, First Publish Date - 2023-12-03T00:40:48+05:30

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు కొత్త విధానాలు అంతగా అచ్చిరానట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలు అటు రిజిస్ర్టేషన కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఇటు క్రయ, విక్రయదారులను ఇక్కట్లకు గురి చేస్తున్నాయి.

రాత్రయినా రామ్‌నగర్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో పనులు ..

రిజిస్ట్రేషనలో అచ్చిరాని కొత్త వర్షన

సాంకేతిక సమస్యలతో ఉద్యోగుల పాట్లు

ఒక్కో డాక్యుమెంటుకు గంటకుపైగా సమయం

వంద రూపాయల స్టాంపునకు రూ.1500 వసూలు

మండలాల్లో అదనంగా రూ.50 నుంచి రూ.100

అనంతపురం క్రైం, డిసెంబరు 2: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు కొత్త విధానాలు అంతగా అచ్చిరానట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలు అటు రిజిస్ర్టేషన కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఇటు క్రయ, విక్రయదారులను ఇక్కట్లకు గురి చేస్తున్నాయి. రిజిస్ర్టేషన ప్రక్రియ సరిగ్గా జరగకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కొంతకాలంగా రిజిస్ర్టేషన శాఖలో 2.0 విధానాన్ని అమలు చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలో తొలిసారిగా నాలుగు రోజుల నుంచి ఆ విధానం అమల్లోకి వచ్చింది. కానీ ఆ విధానంలో రిజిస్ర్టేషన చేస్తున్న క్రమంలో పనులు ముందుకు సాగడం లేదు. సర్వర్‌ సతాయింపు, సాంకేతిక సమస్యలతో రిజిస్ర్టేషన్లు కావడమే గగనంగా మారింది. ఇక అదేవిధంగా ఈస్టాంపింగ్‌ను గత కొన్ని నెలలుగా అమల్లోకి తెచ్చారు. ఇక్కడా పొరపాట్లు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో అదనపు దోపిడీకి సైతం తెరలేపారు. పాత స్టాంపు పేపర్లకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది.

వేలిముద్రకు అరవైసార్లు...

కొత్తగా చేపడుతున్న ఆనలైన విధాన ప్రక్రియ సరిగా జరగకపోవడంతో అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ప్రధానంగా ఈకేవైసీ చేస్తున్న సమయంలోనే అసలు తంటా మొదలవుతోంది. డిజిటల్‌ సైన(సంతకం) విషయంలో సర్వర్‌ సతాయిస్తోంది. ఇరువర్గాలు, సబ్‌రిజిస్ర్టార్‌ సంతకం చేసిన తరువాత సక్సె్‌సఫుల్‌ అయినట్లు చూపుతుంది. కానీ ప్రింట్‌ కావడం లేదు. దీంతో మళ్లీ కథ మొదటికి వ స్తోంది. అంటే మళ్లీ సంతకాల ప్రక్రియ మొదలు పెట్టాలి. ఈ క్రమంలో ఒక్కోసారి థంబ్‌ ఇంప్రెషన కోసం 60 నుంచి 70సార్లు ప్రయత్నించాల్సి వస్తోందని సిబ్బంది వాపోతున్నారు. దీంతో ప్రజలు గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తోంది. శనివారం రాత్రి 7గంటలు దాటినా డాక్యుమెంట్ల పని పూర్తికాలేదు.

రూ.100 స్టాంపునకు రూ.1500..

రిజిస్ర్టేషన శాఖలో గత కొన్ని నెలలుగా ఈ స్టాంపింగ్‌ విధానం అమల్లోకి వచ్చింది. గతంలోలా స్టాంపు పేపర్లు ఉపయోగించడం లేదు. దీంతో ఇదివరకు విడుదల చేసిన స్టాంపులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొందరు ఈ స్టాంపింగ్‌ వచ్చినా పాత స్టాంపులకే పట్టుబడుతుండటంతో వాటికి డిమాండ్‌ పెరిగింది. గతంలో రూ.10, రూ.20, రూ.50, రూ.100లు స్టాంపులు ఉండేవి. ప్రస్తుతం కొంతమంది స్టాంపు వెండర్ల వద్ద రూ.10ల స్టాంపులు మాత్రమే దొరుకుతున్నాయి. రూ.50లు, రూ.100లు మరీ తక్కువగా ఉండటంతో గిరాకీ మరింత పెరిగిందట. దీంతో రూ.50ల స్టాంపును అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇక రూ.100ల స్టాంపును అతి తక్కువ మంది రూ.1500ల నుంచి రూ.2వేలకు విక్రయిస్తున్నారని సమాచారం.

ఒక్కో డాక్యుమెంటుకు గంటకుపైగా..

రిజిస్ర్టేషన ప్రక్రియ ప్రయాసగా మారింది. ఇందుకు సాంకేతికంగా ఎదురవుతున్న సమస్యలే కారణంగా నిలుస్తున్నాయి. తొలిరోజు అనంతపురం నగరంలోని రామ్‌నగర్‌ రిజిస్ర్టేషన కార్యాలయంలో కేవలం ఒక రిజిస్ర్టేషన మాత్రమే జరిగింది. మరుసటి రోజు 30 వరకు డాక్యుమెంట్లు పూర్తయ్యాయి. మిగిలిన సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లోనూ కొంతవరకు రిజిస్ర్టేషన్లు అయ్యాయి. మూడోరోజు దాదాపు జిల్లా వ్యాప్తంగా 250 వరకు రిజిస్ర్టేషన్లు చేశారు. కానీ నాలుగోరోజు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా సర్వర్‌ మొరాయించడంతో ఒక్క రిజిస్ర్టేషన కూడా కాలేదు. దీంతో అటు ప్రజలు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు అసహనానికి గురయ్యారు. శనివారం సైతం సర్వర్‌ సతాయించింది. దీంతో రామ్‌నగర్‌లో 10వరకు , రూరల్‌ సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో మరో నాలుగు రిజిస్ర్టేషన్లు మాత్రమే పూర్తయ్యాయి. ఒక్కో డాక్యుమెంట్‌కు గంటకు పైగా సమయం పడుతోందని సిబ్బంది వాపోతున్నారు.

ఈ స్టాంపింగ్‌లోనూ దోపిడీ...

ఈ స్టాంపింగ్‌ ఇచ్చేవారు సైతం దోపిడీకి పాల్పడుతున్నారు. గతంలోలా స్టాంప్‌ వెండర్లు కాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఈ స్టాంపింగ్‌ చేస్తున్నారు. అనంతపురం, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుత్తి, శింగనమల తదితర ప్రాంతాల్లో రూ.100ల స్టాంపు రూ.150ల వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక జిల్లా వ్యాప్తంగా కొన్ని మండల కేంద్రాల్లో రూ.200ల వరకు విక్రయిస్తున్నారు. కాగా ఇక్కడ సర్వర్‌ సమస్యతో చలానా రూపంలో చెల్లించే డబ్బు కట్‌ అయిపోతోందట. మరికొన్ని సార్లు ఈ స్టాంప్‌లో వచ్చే పేర్లలో అక్షరాల విషయంలో పొరపాట్లు జరుగుతున్నాయి. ఆనలైనతో తలనొప్పులే అధికంగా ఉన్నాయని రిజిస్ర్టేషన వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - 2023-12-03T00:40:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising