రాష్ట్రంలో సైకిల్ ప్రభంజనం తథ్యం: కాలవ
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:48 PM
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో సైకిల్ ప్రభంజనం సృష్టిస్తుందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు.
రాయదుర్గంరూరల్, డిసెంబరు 17: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో సైకిల్ ప్రభంజనం సృష్టిస్తుందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని బీఎనహళ్లి సమీపంలో ఆదివారం మండల కార్యకర్తల సమావేశాన్ని మండల కన్వీనర్ హనుమంతు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు హాజరై మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావ డం తథ్యమన్నారు. రాయదుర్గం కోటపై టీడీపీ జెండా ఎగరేస్తా మన్నారు. వైసీపీ పాలనలో ఇసుక దోపిడీ యఽథేచ్ఛగా సాగుతోందన్నా రు. అక్రమంగా మద్యాన్ని అమ్ముకుని కోట్లు గడిస్తున్నట్లు ఆరోపించారు. అరాచక పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. ఒకటో తేదీ జీతం రాని ఉద్యోగులు మళ్లీ చంద్రబాబునాయుడు ముఖ్య మంత్రి కావాలని ఆశిస్తున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాం లో విద్యుతఛార్జీలను ఒక్కసారి కూడా పెంచలేదని, ఆరుసార్లు విద్యుత ఛార్జీలను పెంచిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో కాపు రామచంద్రారెడ్డి పని అయిపోయిందని కాలవ శ్రీనివాసులుకు పోటీగా మరొకరిని నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గంలో 50 వేల మెజార్టీతో తాను గెలుస్తానని కాలవ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు అశోక్, రాజశేఖర్‌రెడ్డి, వన్నూరుస్వామి, మల్లేష్, టీడీపీ నాయకులు కాటా వెంకటే శులు, పోట్ల రవి, వీరేష్, సోమశేఖ ర్, గిరిధర్‌నాయుడు, గురుమూర్తి, లచ్చన్నచౌదరి, తిపేస్వామి, హేమ్లానాయక్, గోవిందరాజులు, సిద్ధప్ప, జోగప్ప, నాగిరెడ్డిపల్లి హనుమంతు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, మాజీ డీలర్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 11:48 PM