కార్పొరేషన్లకు నిధులివ్వాలి : బీజేపీ
ABN, Publish Date - Dec 18 , 2023 | 11:48 PM
ముఖ్యమంత్రి జగనరెడ్డి వెంటనే 56 కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు డిమాండ్ చేశారు
అనంతపురం సెంట్రల్, డిసెంబరు 18: ముఖ్యమంత్రి జగనరెడ్డి వెంటనే 56 కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించిన ర్యాలీలో ఆయన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిరణ్‌కుమార్ గౌడ్, కడప జిల్లా ఇనచార్జ్ వెంకటేశ్వరరెడ్డితో కలిసి మాట్లాడారు. స్వయం ఉపాధి, పెట్టుబడి సాయం, వాహనాల కొనుగోలు, రుణాలు మంజూరు కార్పొరేషన్ల ఏర్పాటు ముఖ్య ఉద్దేశమన్నారు. సీఎం జగన 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వాటికి చైర్మెనలు, డైరెక్టర్లును నియమించి నిధులివ్వలేదన్నారు. ప్రచారాల కోసం ప్రజలను మభ్యపెట్టేందుకు, కేంద్రం నుంచి అప్పులు పొందేందుకు ఇలా కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడని మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమాన్ని అందించాలన్న చిత్తశుద్ద ఉంటే తక్షణమే నిధులు విడుదలచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కేఎం శ్రీనివాసులు, మందల శాంతకుమార్, అశోక్‌రెడ్డి, మలోబులు, రంజిత చౌహాన పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 11:48 PM