ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కొనసాగిన నిరసన

ABN, Publish Date - Dec 14 , 2023 | 11:33 PM

జిల్లా వ్యాప్తంగా అంగనవాడీల సమ్మె మూడో రోజైన గురువారమూ కొనసాగింది. అంగనవాడీ కేంద్రాలను బంద్‌ చేసి వారు సమ్మె చేపట్టారు.

అనంతపురం బిందెల కాలనీలో అంగనవాడీ కేంద్రం తాళం పగలగొడుతున్న సచివాలయ ఉద్యోగి

ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌ : జిల్లా వ్యాప్తంగా అంగనవాడీల సమ్మె మూడో రోజైన గురువారమూ కొనసాగింది. అంగనవాడీ కేంద్రాలను బంద్‌ చేసి వారు సమ్మె చేపట్టారు. నార్పల, సీకేపల్లి, రామగిరిలో అధికారులు అంగనవాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టారు. సచివాలయ ఉద్యోగులతో అంగనవాడీ కేంద్రాలను ప్రభుత్వం నిర్వహించేలా చర్యలు తీసుకున్న బెదిరే ప్రసక్తే లేదని... సమ్మెను మరింత ఉధృతం చేస్తామని అంగనవాడీలు తెగేసి చెప్పారు. చెన్నేకొత్తపల్లిలో అంగనవాడీలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. నార్పలలో అంగనవాడీలు గడ్డి తింటూ.. గంజి తాగుతూ నిరసన తెలిపారు. శింగనమలలో అంగనవాడీలు భిక్షాటన చేసిన నిరసన తెలిపారు. గార్లదిన్నెలో వీరి సమ్మెకు రైతు సంఘం, సీపీఎం నాయకులు మద్దతిచ్చారు. రామగిరిలో వీరి సమ్మెకు టీడీపీ బీసీసెల్‌ జిల్లా అధ్యక్షుడు రంగయ్య, జేబీఎం పార్టీ సభ్యులు మద్దతు పలికారు. కనగానపల్లిలో అంగనవాడీల సమ్మెకు టీడీపీ మండల కన్వీనర్‌ యాతం పోతలయ్య, తెలుగు యువత బట్టాసురేష్‌ చౌదరి, కసుమూర్తి వెంకటేష్‌, పూజారి రాజాకృష్ణ, మాదినేని సుధాకర్‌, తిరుపాల్‌, సీపీఎం నాయకులు మద్దతిచ్చారు.

Updated Date - Dec 14 , 2023 | 11:33 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising