ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భక్తిశ్రద్ధలతో క్రిస్మస్‌

ABN, Publish Date - Dec 26 , 2023 | 12:18 AM

ఆంధ్రజ్యోతి, న్యూస్‌లైన నెట్‌వర్క్‌: క్రిస్మస్‌ వేడుకలను క్రైస్తవులు సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

ఆంధ్రజ్యోతి, న్యూస్‌లైన నెట్‌వర్క్‌: క్రిస్మస్‌ వేడుకలను క్రైస్తవులు సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే చర్చిలకు వెళ్లి కేండిల్స్‌ వెలిగించి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. పాస్టర్లు పండగ విశిష్ఠత గురించి తెలియజేశారు. అలాగే ఏసు సందేశాలను వినిపించారు. బైబిల్‌లోని ప్రధాన సూక్తులను వివరించారు. పలువురు ఏసుక్రీస్తుపై పాటలు పాడారు. పలు చోట్ల చిన్నారులు శాంతాక్లాజ్‌ వేషధారణలతో సందడి చేశారు. వివిధ మతాల వారు కూడా వేడుకల్లో పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో చర్చిలన్నీ కిటకిటలాడాయి. ముఖ్యంగా పుట్టపర్తి, కదిరి, ధర్మవరం నియోజకవర్గాల కేంద్రాలతో పాటు అన్ని మండలకేంద్రాలు, గ్రామాల్లోని చర్చిలన్నీ పండుగ కళను సంతరించుకున్నాయి. క్రైస్తవుల ఇళ్లల్లోనూ బంధువులు, స్నేహితుల రాకతో సందడి నెలకొంది.

Updated Date - Dec 26 , 2023 | 12:18 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising