ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎనఈపీతో భవిష్యత్తులో పెను ప్రమాదం

ABN, First Publish Date - 2023-11-10T00:29:07+05:30

విద్యా సంస్కరణల పేరిట కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ఎనఈపీ-2020.. భవిష్యత్తులో విద్యారంగానికి పెను ప్రమాదంగా మారనుందని పలువురు విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

సదస్సులో పాల్గొన్న వక్తలు

అనంతపురం సెంట్రల్‌, నవంబరు 9: విద్యా సంస్కరణల పేరిట కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ఎనఈపీ-2020.. భవిష్యత్తులో విద్యారంగానికి పెను ప్రమాదంగా మారనుందని పలువురు విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రమాదంలోకి నెట్టిందని వాపోయారు. గురువారం కేఎస్‌ఎన మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆల్‌ ఇండియా సేవ్‌ ఎడ్యుకేషన కమిటీ (ఏఐఎస్‌ఈసీ) రాష్ట్ర ద్వితీయ మహాసభలను ఘనంగా నిర్వహించారు. ‘ఎనఈపీ-2020 - ఉన్నత విద్యా వ్యవస్థలో సంస్కరణలు’ అనే అంశంపై ఇందులో చర్చించారు. ఏఐఎస్‌ఈసీ రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్‌ డిగ్రీ లెక్చరర్‌ వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్‌ కరుణానంద్‌, పాఠ్యపుస్తకాల రచయిత వెంకటరమణ, రిటైర్డ్‌ డిగ్రీ ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌ అతిథులుగా హాజరయ్యారు. ఎనఈపీను విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు వ్యతిరేకిస్తున్నా.. బీజేపీ లేక్కచేయలేదని మండిపడ్డారు. అనంతరం 40 మంది సభ్యులతో ఏఐఎస్‌ఈసీ రాష్ట్ర కమిటీని ఎంపికచేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శిగా సుబ్రమణ్యం ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నాయకులు గోవిందరాజులు, రాజశేఖర్‌, సుబ్రమణ్యం, మల్లిక్‌ దత, వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-10T00:29:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising