ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అంగనవాడీల పోరాటం స్ఫూర్తిదాయకం

ABN, Publish Date - Dec 30 , 2023 | 01:29 AM

అంగనవాడీలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం 18రోజులుగా చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. పట్టణంలోని తహసీల్దారు కార్యాలయ ఆవరణలో అంగనవాడీలు చేస్తున్న రిలే దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు.

పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్‌

ఉరవకొండ, డిసెంబరు 29: అంగనవాడీలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం 18రోజులుగా చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. పట్టణంలోని తహసీల్దారు కార్యాలయ ఆవరణలో అంగనవాడీలు చేస్తున్న రిలే దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేశవ్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. సీఎం తాను చెప్పిందే జరగాలనే మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ ఇచ్చిన 714హామీలలో 85శాతం హామీలను విస్మరించారన్నారు. పాదయాత్ర సమయంలో తెలంగాణలో కన్నా అదనంగా అంగనవాడీలకు వేతనాలు చెల్లిస్తామని మాట తప్పారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే అంగనవాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆడబిడ్డల ఉసురు పోసుకున్న ఏ ఒక్కరూ బాగుపడిన దాఖాలాల్లేవన్నారు. వైసీపీ ప్రభుత్వ అన్ని వర్గాలకు చేసిన మోసంపైన శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రంగారెడ్డి, మధుసూదన, అంగనవాడీ నాయకురాళ్లు రంగమ్మ, వరలక్ష్మి, ఝాన్సీ, నాగరత్న పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 01:29 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising