ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గరిటెలతో ప్లేట్లు కొడుతూ అంగనవాడీల నిరసన

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:56 PM

సమస్యల సాధన కోసం అంగనవాడీలు చేపట్టిన సమ్మె మంగళవారం 15వ రోజుకు చేరింది.

రొళ్లలో నిరసన తెలుపుతున్న అంగనవాడీలు

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌)

సమస్యల సాధన కోసం అంగనవాడీలు చేపట్టిన సమ్మె మంగళవారం 15వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వినూత్నంగా నిరసన తెలిపారు. సీఐటీయూ నాయకులు, అంగనవాడీ కార్యకర్తలు, గరిటెలతో పళ్లాలను మోదుతూ తమ నిరసన తెలిపారు. హిందూపురం, పెనుకొండ, మడకశిర, గోరంట్ల, చిలమత్తూరు, రొళ్ల, గుడిబండ, అగళి తదితర చోట్ల నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా యూనియన నాయకులు మాట్లాడుతూ... తాము 15 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నా రు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పంధించి తమ డిమాండ్ల పరిష్కారిని చర్యలు తీసుకోవాలని కోరారు. చిలమత్తూరు అంగనవాడీల సమ్మెకు యూటీఎఫ్‌ నాయకులు మద్దతు తెలిపారు. గోరంట్లలో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి సతీమణి కమలమ్మ, కుమారుడు సాయికళ్యాణ్‌ నాయకులతో వచ్చి మద్దతుపలికారు. సీసీఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌, ఏపీటీఎఫ్‌ నాయకులు, ఆశా కార్యకర్తలు సంఘీభావం తెలిపారు.

Updated Date - Dec 26 , 2023 | 11:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising