అరాచకపాలనకు చరమగీతం పాడాలి
ABN, First Publish Date - 2023-10-30T23:31:29+05:30
వచ్చే 2024 ఎన్నికల్లో అవినీతి, అరాచకపాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.
మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు
గుమ్మఘట్ట, అక్టోబరు30: వచ్చే 2024 ఎన్నికల్లో అవినీతి, అరాచకపాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం బాబు ష్యూరిటీ భవిష్యతకు గ్యారెంటీ కార్యక్రమాన్ని మండలంలోని కోనాపురం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆంజనేయస్వామి ఆలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూజలు జరిపించారు. అనంతరం గడప గడపకు వెళ్లి బాబుష్యూరిటీ భవిష్యతకు గ్యారెంటీ పత్రాలను కుటుంబసభ్యులకు అందిస్తూ జగనరెడ్డి అరాచకపాలన, చంద్రబాబు అక్రమ అరెస్టుపై వివరించారు. జగనరెడ్డి పైశాచిక ఆనందంతో చంద్రబాబును అక్రమంగా 50 రోజులకు పైబడి జైలులో ఉంచి దుర్మార్గపు పాలన చేస్తున్నాడని దుయ్యబట్టారు. తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయినా పట్టించుకోని ముఖ్యమంత్రి, సామాజిక న్యాయం పేరుతో బస్సు యాత్ర చేపట్టడం దుర్మార్గమన్నారు. బడుగు, బలహీన వర్గాలను ఏనాడు పట్టించుకోని ముఖ్యమంత్రి ఎన్నికల వేళ మోసపూరిత మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వచ్చే ఎన్నికలలో తరిమి కొట్టాలని పేర్కొన్నారు. కార్య క్రమంలో టీడీపీ కన్వీనర్ గిరిమల్లప్ప, క్లస్టర్ ఇనచార్జ్ కాలవ సన్నన్న, తెలుగు యువత రమేష్, కేపీదొడ్డి నాగరాజు, స్థానిక నాయకులు మల్లారెడ్డి, కుమార్‌రెడ్డి, మంజునాథతో పాటు వివిధ గ్రామాలకు చెందిన బేలోడు సంజీవ, పైదొడ్డి రాజు, లోకేష్, బంజోబ, గోనబావి దుర్గేష్, పూలకుంట బాలు, సర్పంచ నాగరాజు, సత్యనారాయణ, చెన్నప్ప, నీరగంటి తిమ్మప్ప, దేవరాజ్‌తో పాటు మరికొంతమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2023-10-30T23:31:29+05:30 IST