ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అన్ని మండలాలను కరువుప్రాంతాలుగా ప్రకటించాలి

ABN, First Publish Date - 2023-12-04T00:42:44+05:30

ధర్మవరం రూరల్‌, డిసెంబరు3: జిల్లావ్యాప్తం గా ఉన్న అన్ని మండలాల ను కరువుప్రాంతాలుగా ప్రకటించాలని సీపీఎం రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న కోరారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ధర్మవరం రూరల్‌, డిసెంబరు3: జిల్లావ్యాప్తం గా ఉన్న అన్ని మండలాల ను కరువుప్రాంతాలుగా ప్రకటించాలని సీపీఎం రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న కోరారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను, కార్మికులను పూర్తిగా విస్మరిస్తున్నాయన్నారు. పంటలన్నీ దెబ్బతిని రైతులు అప్పులపాలయ్యారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని మండిపడ్డారు. జిల్లాలో 32మండలాలకు గాను 21మండలాలను మాత్రమే కరువు కింద ప్రకటించారని , ఇంకా 11మండలాలను ప్రకటించకపోవడం శోచనీయమని అన్నారు. అన్నిమండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని, జిల్లాకు 50వేల కోట్ల ప్రత్యేక నిధి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా రైతులకు రుణమాఫీచేయాలని, నష్టపోయిన వేరుశనగపంటకు ఎకరాకు 35వేలు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ అన్ని మండల కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించనున్నామన్నారు. రైతులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఆయూబ్‌ఖాన, నామాలనాగార్జున, కొత్తపేట మారుతి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-04T00:42:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising