గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ధర్మవరం నాట్యకళాకారులకు చోటు
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:11 AM
ధర్మవరం, డిసెంబరు 25: పట్టణానికి చెందిన శ్రీలలిత నాట్యకళానికేతన కళాకారులు 12మందికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కిందని నాట్యాచార్యులు బాబూబాలాజీ పేర్కొన్నారు.
ధర్మవరం, డిసెంబరు 25: పట్టణానికి చెందిన శ్రీలలిత నాట్యకళానికేతన కళాకారులు 12మందికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కిందని నాట్యాచార్యులు బాబూబాలాజీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో సోమవారం భారత ఆర్ట్స్ ఆకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి కళావైభవం జరిగింది. ఇందులో 5వేల మంది అంతర్జాతీయ స్థాయి కళా నృత్యకళాకారులు పాల్గొన్నారు. ఇందులో 3782 మంది 7 నిమిషాల పాటు కూచిపూడి నృత్యాన్ని లయబద్ధంగా చేశారు. దీంతో వారందరికీ గిన్ని్‌సబుక్ ఆఫ్ రికార్డులో చోటుదక్కినట్టు నాట్యాచార్యులు బాబూ బాలాజీ తెలిపారు. వారిలో తన శిష్యబృందం రామలాలిత్య, సర్వశ్రీ, హృషిత, వేదప్రజ్ఞ, తనూలత, ఉమాప్రియ, వైష్ణవి, అధిత్రి, జాహ్నవి, లీలా మాధవి, ఉదయ శ్రీ, సహస్ర ఉన్నట్లు చెప్పారు. వీరిని ధర్మవరం పట్టణ ప్రజలు అభినందనలు తెలియజేశారు.
Updated Date - Dec 26 , 2023 | 12:11 AM