ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్లపై గుంతలు పూడ్చలేని ప్రభుత్వం

ABN, First Publish Date - 2023-11-19T23:45:21+05:30

ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని రహదారుల్లో ఏర్పడిన గుంతలు పూడ్చలేని పరిస్థితి లో ఉందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు.

మధుగిరి రోడ్డులో గుంతలను పరిశీలిస్తున్న గుండుమల తిప్పేస్వామి

కలెక్షన ఫుల్‌, అభివృద్ధి నిల్‌

ఇది రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి : గుండుమల

మడకశిరటౌన, నవంబరు 19: ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని రహదారుల్లో ఏర్పడిన గుంతలు పూడ్చలేని పరిస్థితి లో ఉందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. కలెక్షన ఫుల్‌, అభివృద్ధి నిల్‌ అనే రీతిలో పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. ఆయన ఆదివారం టీడీపీ, జనసేన, టీడీపీ నాయకులతో కలిసి పట్టణ సమీపంలో రోడ్లపై ఏర్పడిన గుంతల వద్ద నిరసన కార్యక్రమం చే పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో వైసీపీ ప్రభు త్వం వచ్చినప్పటి నుంచి రహదారులు అధ్వానంగా మారాయని, కనీసం గుంతలు పూడ్చలేని పరిస్థితిలో ఉన్న జగన మూడు రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు. మధుగిరి రోడ్డులో నాలుగున్నర సంవత్స రాలు దాటినా ఏర్పడిన గుంతలు పూడ్చలేని నిస్సహాయ స్థితిలో ఈ ప్రభు త్వం ఉందన్నారు. ప్రతినిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. అనేక మంది ప్రమాదాలు జరిగి ఆస్ప త్రుల పాలయ్యారన్నారు. అయినా ప్రభుత్వం మొద్దునిద్ర వదలడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన ప్రగల్భాలు పలుకుతున్నారే తప్ప అభివృద్ధి చేసింది శూన్యమన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, జిల్లా మైనారిటీ అ ధ్యక్షుడు భక్తర్‌, పట్టణ అధ్యక్షుడు మనోహర్‌, కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, డాక్టర్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి, మున్సిపల్‌ మాజీ చైర్మన సుబ్బ రాయుడు, నాయకులు రవికుమార్‌, తిమ్మరాజు తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-11-19T23:45:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising