ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP: చంద్రబాబు కోసం సకల మత ప్రార్థనలు

ABN, First Publish Date - 2023-09-19T15:35:23+05:30

తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో సకల మత ప్రార్థనలు నిర్వహించారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము (TDP Leader Venigandla Ramu) ఆధ్వర్యంలో సకల మత ప్రార్థనలు నిర్వహించారు. బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము సకల మత ప్రార్థనలు నిర్వహించారు. గుడ్లవల్లేరు మండలం వేమవరం కొండాలమ్మ తల్లికి చీర, సారే సమర్పించారు. ఈ సందర్భంగా వెనిగండ్ల రాముకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం కొండలమ్మ తల్లి ఆలయంలో టీడీపీ నేత ప్రత్యేక పూజలు చేశారు. ఆపై కౌతవరం మినార్ మసీద్ సందర్శించిన వెనిగండ్ల రాము.. మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి నుంచి గుడ్లవల్లేరు ఆర్సీఎమ్‌ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తరువాత గుడ్లవల్లేరు సంత బజార్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సర్వమత ప్రార్థనల అనంతరం టీడీపీ నాయకులు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచం గౌరవించే వ్యక్తి చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) అని.. అటువంటి వ్యక్తిని అక్రమ నిర్బంధం చేశారన్నారు. చంద్రబాబుకు న్యాయ సంబంధమైన చిక్కుల నుంచి విముక్తి కలగాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలందరి ప్రార్థనలతో టీడీపీ అధినేత నిర్దోషిగా బయటికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. తమ పోరాటంలో జనసేన నాయకులు భాగస్వాములు కావటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. దుష్ట పాలన అంతం అయ్యే రోజు దగ్గర్లోనే ఉందని వెనిగండ్ల రాము వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-19T15:35:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising