ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కోడుమూరు ఎమ్మెల్యేకు చేదు అనుభవం

ABN, First Publish Date - 2023-11-29T04:33:24+05:30

కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌కు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది.

సి.బెళగల్‌ మండలంలో నిలదీసిన మహిళలు

సి. బెళగల్‌, నవంబరు 28: కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌కు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన సి.బెళగల్‌ మండలంలోని కొండాపురం ఎస్సీకాలనీలో పర్యటించారు. గ్రామానికి చెందిన సునీత, హనుమక్క ఇళ్ల వద్దకు ఎమ్మెల్యే వెళ్లారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను నిలదీశారు. ‘నాలుగు సంవత్సరాల నుంచి టైలరింగ్‌ పనితో జీవనం కొనసాగిస్తున్నా. నేను ఈ ఊరు కోడలిని. అధికారుల చుట్టూ తిరిగినా నాకు చేయూత మంజూరు కాలేదు. నాకు 11ఎకరాల పొలం ఉందని ఆన్‌లైన్‌లో చూపిస్తున్నారు..’ అంటూ సునీత ఆగ్రహం వ్యక్తం చేసింది. సుధాకర్‌ సర్దిచెప్పాలని ప్రయత్నించినా.. ‘అవన్నీ కాదు సార్‌.. నాకు 11 ఎకరాల పొలం ఉందని చెప్పారు. నాకు పొలమైనా ఇప్పించు.. లేదా ఇప్పటివరకు కోల్పోయిన ప్రభుత్వ పథకాలన్నీ ఇవ్వండి..’ అని డిమాండ్‌ చేసింది. అలాగే, ‘నేను ఇల్లు కట్టుకున్నా బిల్లు మంజూరు కాలేదు. ఎన్నిసార్లు అడుక్కోవాలి.. ఎస్సీ ఎమ్మెల్యేగా ఉంటూ ఎస్సీలకే అన్యాయం చేస్తున్నావ్‌...’ అంటూ హనుమక్క ఆగ్రహం వ్యక్తం చేసింది. వారే కాకుండా, కాలనీలోని మహిళలందరూ ఎమ్మెల్యేను చుట్టుముట్టి కట్టడి చేశారు.

Updated Date - 2023-11-29T04:33:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising