Jagadish Reddy: పక్క రాష్ట్రాలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నాయి
ABN, First Publish Date - 2022-12-24T16:21:54+05:30
పక్క రాష్ట్రాలు కూడా కేసీఆర్(Cm kcr) లాంటి పాలన కావాలని కోరుకుంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి
కేసీఆర్ పాలనను కోరుకుంటున్నాయి
సూర్యాపేట: పక్క రాష్ట్రాలు కూడా కేసీఆర్ (Cm kcr) లాంటి పాలన కావాలని కోరుకుంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కిషన్‌రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay) మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు. భారతదేశంలో వ్యవసాయ రంగం మొతాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలని మోడీ చేస్తున్న ప్రయత్నాన్ని దేశ రైతాంగం గమనించిందని చెప్పారు. దేశంలో రైతాంగానికి క్షమాపణ చెప్పి రికార్డ్ సృష్టించిన మొట్ట మొదటి ప్రధాని మోదీనేనని(pm modi) మంత్రి వ్యాఖ్యానించారు.
Updated Date - 2022-12-24T16:21:56+05:30 IST