JP Nadda: కేసీఆర్ పాలనంతా అవినీతి, అక్రమాలే
ABN, First Publish Date - 2022-12-15T18:26:46+05:30
సీఎం కేసీఆర్ పాలనంతా అవినీతి, అక్రమాలేనని బీజేపీ నేత జేపీ నడ్డా (JP Nadda) దుయ్యబట్టారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో 5వ విడత ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభకు నడ్డా ముఖ్య అతిథిగా వచ్చారు.
కరీంనగర్: సీఎం కేసీఆర్ పాలనంతా అవినీతి, అక్రమాలేనని బీజేపీ నేత జేపీ నడ్డా (JP Nadda) దుయ్యబట్టారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో 5వ విడత ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభకు నడ్డా ముఖ్య అతిథిగా వచ్చారు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నకు ప్రణామాలు తెలుపుతూ ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఉద్యమాల గడ్డ కరీంనగర్ అని కొనియాడారు. అన్నివర్గాల సంక్షేమం కోసమే బీజేపీ (BJP) పాటుపడుతోందని తెలిపారు. ప్రజాసంగ్రామ యాత్ర ఆరంభం మాత్రమే.. ఆగేది కాదని ప్రకటించారు. ప్రజా గోస-బీజేపీ భరోసా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ (CM KCR)కు ప్రజలు గుడ్‌బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీజేపీకి అధికారం, కేసీఆర్‌కు విశ్రాంతి అవసరమన్నారు.
కేసీఆర్ తెలంగాణను అప్పులకుప్పగా మార్చేశారని జేపీ నడ్డా దుయ్యబట్టారు. దోచుకోవడం, దాచుకోవడమే కేసీఆర్ సర్కార్ పనిగా పెట్టుకుందని విమర్శించారు. బీఆర్‌ఎస్ (BRS) త్వరలోనే వీఆర్‌ఎస్ (VRS) కాబోతుందని ఎద్దేవాచేశారు. దళితుడిని సీఎం చేస్తామన్న కేసీఆర్ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు కుటుంబ పాలన తప్ప ప్రజాసంక్షేమం పట్టదన్నారు. బీజేపీ మాత్రమే కేసీఆర్‌ను గద్దె దించగలదని జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు.
Updated Date - 2022-12-15T18:26:48+05:30 IST