ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖమ్మంలో టీడీపీ బహిరంగసభ

ABN, First Publish Date - 2022-11-19T03:04:11+05:30

ఖమ్మంలో త్వరలోనే భారీ బహిరంగసభ నిర్వహించాలని టీడీపీ రాష్ట్రశాఖ నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఖమ్మంలో త్వరలోనే భారీ బహిరంగసభ నిర్వహించాలని టీడీపీ రాష్ట్రశాఖ నిర్ణయించింది. ఈనెల 26న ఖమ్మం జిల్లా పార్టీ నేతలతో చర్చించి, నిర్వహణ తేదీని ఖరారు చేయనుంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన భారీ ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత ఎన్‌. చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ణానేశ్వర్‌ అధ్యక్షతన శుక్రవారం ఎన్టీఆర్‌భవన్‌లో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సమన్వయకర్తకంభంపాటి రామ్మోహన్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అరవింద్‌గౌడ్‌, జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వరంగల్‌, మహబూబ్‌నగర్‌ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్ష పదవులతో పాటు ఖాళీగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. వచ్చేనెల మొదటివారంలో పార్టీ రాష్ట్ర విస్తృత సమావేశం నిర్వహిస్తామని వారు చెప్పారు.

సింగరేణి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ: కాసాని

సింగరేణి ఎన్నికల్లో టీఎన్‌టీయూసీ ఒంటరిగా పోటీచేయాలని కాసాని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన టీఎన్‌టీయూసీ నేతలకు సూచించారు. కాగా సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కాసాని సమక్షంలో టీడీపీలో చేరారు.

Updated Date - 2022-11-19T03:04:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising