TS News: సడన్‌గా వచ్చిన కారు... పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ABN, First Publish Date - 2022-12-31T12:07:02+05:30
నగరంలోని బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది
హైదరాబాద్: నగరంలోని బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హైదర్ షాకోట్ విలేజ్‌కు సమీపంలోని రోడ్డు పక్క ఉన్న పొదల్లోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు అద్దాలు పగల గొట్టి మరీ ప్రయాణికులు బయటకు వచ్చారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ చేతికి ముందు నుంచే గాయం ఉందని బస్సు ప్రయాణికులు చెబుతున్నారు. కారు రావడంతో బ్రేక్ వేయడంతో ఆర్టీసీ ఒక్కసారిగా పొదల్లోకి దూసుకెళ్లింది. ఆపై విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి స్తంభంపై నిలిచిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-12-31T12:07:03+05:30 IST