ఎన్‌హెచ్-65పై హైదరాబాద్ - నందిగామ రోడ్డు విస్తరణ అవసరం లేదు: కేంద్రం
ABN, First Publish Date - 2022-12-16T00:34:38+05:30
జాతీయ రహదారి - 65పై హైదరాబాద్ - నందిగామ సెక్షన్‌లో (181.5 కిలోమీటర్లు) రోడ్డును 6 లేన్లకు విస్తరించాల్సిన అవసరం లేదని, ఉన్న రద్దీకి ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్లు
న్యూఢిల్లీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి - 65పై హైదరాబాద్ - నందిగామ సెక్షన్‌లో (181.5 కిలోమీటర్లు) రోడ్డును 6 లేన్లకు విస్తరించాల్సిన అవసరం లేదని, ఉన్న రద్దీకి ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్లు సరిపోతాయని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి గురువారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని పేర్కొన్నారు. అక్కడి నుంచి 40 కిలోమీటర్ల వరకు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు.
విజయవాడ రోడ్డును విస్తరించాలి: ఎంపీ కోమటిరెడ్డి
హైదరాబాద్ - విజయవాడ రహదారిని ప్రాధాన్యత కింద పరిగణించి మొత్తం విస్తరించాలని కేంద్రానికి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం లోక్‌సభలో 377వ నిబంధన కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువ అవ్వడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, అనేక మంది మరణిస్తున్నారని, ఈ నేపథ్యంలో రోడ్డును విస్తరించాలని ఆయన విన్నవించారు.
Updated Date - 2022-12-16T00:34:39+05:30 IST