Dammaiguda Girl: గాంధీ ఆస్పత్రిలో బాలిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
ABN, First Publish Date - 2022-12-16T14:52:28+05:30
గాంధీ ఆస్పత్రిలో దమ్మాయిగూడ బాలిక మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి అయ్యింది.
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో దమ్మాయిగూడ బాలిక మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి అయ్యింది. గ్రూప్ ఆఫ్ డాక్టర్స్‌తో పంచనామా, పోస్ట్ మార్టం పూర్తి చేశారు. నాలుగు పేజీల పంచనామాలో మొత్తం 22 కాలమ్స్‌లో అధికారులు వివరాలు రికార్డ్ చేశారు. మరి కాసేపట్లో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. బాలిక ఒంటిపై ఉన్న గాయలపై స్పష్టత రావాల్సి ఉంది.
చెరువులో మృతదేహం...
నిన్న ఉదయం పాఠశాలకు వెళ్లి కనిపించకుండాపోయిన దమ్మాయిగూడ బాలిక విషాదాంతంగా ముగిసింది. . అంబేడ్కర్‌నగర్‌లోని ఎన్‌టీఆర్‌నగర్ కాలనీకి చెందిన జడల నరేశ్ చిన్న కూతురు ఇందు(10) నాలుగో తరగతి చదువుతోంది. నిన్న ఉదయం స్కూలు వెళ్లిన ఇందు కనిపించకుండా పోయింది. పాఠశాలలో బ్యాగ్ వదిలిపెట్టి సమీపంలో ఉన్న పార్కుకు ఆడుకోడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిందని తోటి విద్యార్థులు తెలిపారు. పాప ఎక్కడా కనిపించకపోవడంతో తల్లిదండ్రులకు పాఠశాల ఉపాధ్యాయుడు సమాచారం అందించారు. పరిసరాల్లో గాలించినా బాలిక కనిపించకపోవడంతో తండ్రి నరేశ్ జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేయడంతో శుక్రవారం దమ్మాయిగూడ చెరువులో పాప మృతదేహం లభ్యమైంది. కాగా... పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించే క్రమంలో పోలీస్ వాహనానికి తల్లిదండ్రులు అడ్డుపడ్డారు. పోలీస్ వాహనం ఎక్కి వాహనాన్ని ముందుకు వెళ్లనీయకుండా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో దమ్మాయిగూడ చెరువు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారి మృతిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-12-16T15:08:22+05:30 IST