ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ప్రగతి భవన్ స్ర్కిప్ట్: లక్ష్మణ్
ABN, First Publish Date - 2022-11-01T14:13:15+05:30
ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ప్రగతి భవన్ స్ర్కిప్ట్ అని, ఎమ్మెల్యేలకు ఎర విషయంలో బీజేపీ పాత్ర లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ప్రగతి భవన్ స్ర్కిప్ట్ అని, ఎమ్మెల్యేలకు ఎర విషయంలో బీజేపీ పాత్ర లేదని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ముఖ్యమంత్రి సహా.. ఏ పదవి తాను ఆశించటం లేదన్నారు. గెలుపు గుర్రాలకే అసెంబ్లీ టికెట్లు ఇవ్వడం జరుగుతుందని, తాను పోటీచేసేది... లేనిదీ.. బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు.
మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా భావించటంలేదని లక్ష్మణ్ అన్నారు. అవినీతి చేయకుంటే కేసీఆర్ సర్కార్ జీవో 51ను ఎందుకు తీసుకొచ్చిందని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే టీఆర్ఎస్‌కు వేసినట్లేనని అన్నారు. ప్రతిపక్షపాత్ర పోషించటంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి కమిటీని నియమించారని, రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం వలనే.. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఆలస్యమైందన్నారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలే మునుగోడులో పునరావృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ భవిష్యత్ కోసం మునుగోడులో బీజేపీని గెలిపించాలని లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2022-11-01T14:13:19+05:30 IST