ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul Dravid: ద్రవిడ్ ఆ జట్టుకు కోచ్‌గా ఉండడం బెటర్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్

ABN, First Publish Date - 2022-11-12T15:07:03+05:30

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత జట్టు (Team India) దారుణ ఓటమి తర్వాత తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత జట్టు (Team India) దారుణ ఓటమి తర్వాత తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ ఆటగాళ్ల తీరును అభిమానులు ఎండగడుతున్నారు. పలువురు మాజీ క్రికెటర్లు కూడా జట్టుపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) సారథ్యంలోని కోచింగ్ బృందానికి విశ్రాంతి కల్పించి జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌‌ (VVS Laxman)కు కోచ్ బాధ్యతలు అప్పగించారు. సీనియర్ ఆటగాళ్లు అయిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul), స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ (Ravichandran Ashwin)లకు ఈ టూర్ నుంచి విశ్రాంతి కల్పించారు.

ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా( Danish Kaneria) స్పందించాడు. పొట్టి ఫార్మాట్‌కు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉండడం సరికాదని అన్నారు. భారత జట్టును టీ20 చాంపియన్లుగా నిలిపేంత ‘మైండ్‌సెట్’ ద్రవిడ్‌కు లేదని అభిప్రాయపడ్డాడు. కనేరియా తన యూట్యూబ్ చానల్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. టీ20 జట్టుకు కోచ్‌గా వ్యవహరించేందుకు రాహుల్‌‌కు ఉన్న అర్హతలేంటని ప్రశ్నించాడు. భారత జట్టు పొట్టిఫార్మాట్‌లో విజయం సాధించాలంటే దూకుడు అవసరమని, ద్రవిడ్‌‌లో అది లోపించిందని అన్నాడు.

పంత్‌ను తుది జట్టులోకి తీసుకున్నప్పుడు అతడిని ఉపయోగించుకోవాలని, బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి పంపాలని కనేరియా అన్నాడు. కేఎల్ రాహుల్ అవుటయ్యాక, పంత్ 19వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడని గుర్తు చేశాడు. అప్పుడొచ్చి పంత్ ఏం చేస్తాడని ప్రశ్నించాడు. ఇండియా తన దృక్పథాన్ని మార్చుకోవాల్సిందేనని సూచించాడు. రాహుల్ ద్రవిడ్ కూడా మానసికంగా మారాలని అన్నాడు. క్రికెటర్‌గా రాహుల్ ద్రవిడ్ టెస్టుల్లో అద్భుతమైన ఆటగాడని, కాబట్టి అతడు టెస్టు జట్టుకు కోచ్‌గా ఉండడం బెటరని అన్నాడు. ద్రవిడ్‌లో దూకుడు లేదని, ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో అతడికి తెలియదని అన్నాడు. ద్రవిడ్ ‘కూల్ అండ్ కామ్ క్రికెటర్’ అని అన్నాడు. ద్రవిడ్ రోజు మొత్తం క్రీజులో ఉండగలడని ప్రశంసించాడు. అయితే, టీ20 క్రికెట్‌లో మాత్రం ఒత్తిడిని తట్టుకుని నిలబడాల్సి ఉంటుందన్నాడు. కానీ, ద్రవిడ్ ఒత్తిడిని ఎదుర్కోలేకపోయాడని అన్నాడు. అలాగే, రాహుల్ తెవాటియా, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లను తీసుకోకపోవడాన్ని కూడా కనేరియా ప్రశ్నించాడు.

Updated Date - 2022-11-12T15:07:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising