ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంతకీ ఇదేంటి..? పాము ఆకారంలో రెక్కలు.. వింత జీవిని చూసి నివ్వెరపోయిన జనం.. దేవత అంటూ పూజలు..!

ABN, First Publish Date - 2022-09-26T23:32:12+05:30

బీహార్‌ (Bihar)లోని కాలా బరియా గ్రామంలో ఓ వింత సీతాకోక చిలుక హల్‌చల్ చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీహార్‌ (Bihar)లోని కాలా బరియా గ్రామంలో ఓ వింత సీతాకోక చిలుక హల్‌చల్ చేస్తోంది. పాము ఆకారాన్ని పోలి ఉన్న రెక్కలతో ఉన్న ఆ వింత జీవి శనివారం రాత్రి గ్రామంలోని ఓ బల్బు దగ్గరకు వచ్చింది. తొలుత గ్రామస్థులు దానిని పాముగానే భావించారు. అయితే దాని రంగు, రూపం, ఆకృతి భిన్నంగా కనిపించడంతో గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది. ఆ జీవిని కొందరు వనదేవత అవతారంగా, మరికొందరు సైతాను రూపంగా భావించడం ప్రారంభించారు. 


ఇది కూడా చదవండి..

పొట్టంతా ఉబ్బి 16 ఏళ్ల కూతురికి నరకం.. గ్యాస్ వల్లేనని డౌట్‌తోనే ఆస్పత్రికి.. టెస్టులు చేసి డాక్టర్లు చెప్పింది విన్న ఆ తల్లిదండ్రులకు..


ఆ వింత జీవిని దేవతగా భావించినవారు దాని ముందు నెయ్యి దీపాలు, అగరబత్తులు వెలిగించి పూజలు చేశారు. అయితే ఆ జీవిని అట్లాస్ మాత్ (atlas moth) అనే కీటకంగా WWF (వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్) కో-ఆర్డినేటర్  గుర్తించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కీటక జాతులలో ఒకటి. సీతాకోక చిలుకలా కనిపించే ఈ కీటకం రెక్కలు పాము ఆకారంలో ఉంటాయి. ఆ రెక్కల పొడవు 12 నుంచి 17 సెం.మీ. వరకు ఉంటుంది. సీతాకోకచిలుక లాంటి ఈ కీటకం నిజానికి చాలా అరుదుగా కనిపిస్తుందని, పగటి అసలు కనిపించదని చెబుతున్నారు. భారతదేశంతో పాటు స్పెయిన్, ఆఫ్రికా, జపాన్, అమెరికా, మలేషియా, చైనా మొదలైన దేశాలలో కూడా ఈ కీటకాలు కనిపిస్తాయని తెలిపారు. 



అటవీ ప్రాంతాల్లో తప్ప జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ఇవి కనిపించడం చాలా అరుదని పేర్కొన్నారు. ఇతర జంతువుల నుంచి ప్రమాదం ఉందని భావించినపుడు, వాటిని భయపెట్టడానికి అట్లాస్ మాత్.. పాము తలలా కనిపించే దాని రెక్కలను విప్పుతుంది. చీకట్లో మాత్రమే ఎగిరే అట్లాస్ మాత్ ఎక్కడైనా కాంతి కనిపిస్తే అక్కడే గంటల తరబడి ఉండిపోతుంది. కాగా, అట్లాస్ మాత్ ఉత్పత్తి చేసే ఉన్ని లాంటి పట్టు చాలా మన్నికైనది. దానిని ఫాగ్రా సిల్క్ అని పిలుస్తారు. 

Updated Date - 2022-09-26T23:32:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising