ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fraud: ఘరానా మోసం.. ప్రపంచ బ్యాంక్‌లో జాబ్ పేరు చెప్పి రూ.40 లక్షలు టోకరా!

ABN, First Publish Date - 2022-07-22T23:56:57+05:30

ప్రపంచ బ్యాంకు (World Bank)లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కొందరు వ్యక్తులు ఏకంగా రూ.40 లక్షలకు టోకరా వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచ బ్యాంకు (World Bank)లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కొందరు వ్యక్తులు ఏకంగా రూ.40 లక్షలకు టోకరా వేశారు. పంజాబ్‌లో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఫతేగర్ సాహిబ్‌కు చెందిన అమర్‌జోత్ సింగ్, ఘాజీపూర్‌కి చెందిన హర్‌ప్రీత్ కౌర్, అజిత్ సింగ్‌లను నిందితులుగా గుర్తించారు. వీరిలో అజిత్ సింగ్ మరో మోసం కేసులో ఇప్పటికే జైలులో ఉన్నాడు. లూధియానా (Ludhiana)కు చెందిన సీమా జైన్ అనే ఉపాధ్యాయురాలు తన తోటి ఉపాధ్యాయులైన అజిత్ సింగ్‌ను నమ్మి మోసానికి గురైంది. 


ఇది కూడా చదవండి..

Ambulance Accident: టోల్‌బూత్‌ను ఢీ కొట్టిన అంబులెన్స్.. షాకింగ్ వీడియో వైరల్


మానవ వనరుల మంత్రిత్వ శాఖలో తనకు తెలిసిన వారు ఉన్నారని, వారి ద్వారా ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం ఇప్పించగలనని సీమా జైన్‌ను అజిత్ సింగ్ నమ్మించాడు. అమర్ జోత్ సింగ్‌ను మానవ వనరుల మంత్రిత్వ శాఖలో ఉద్యోగిగా, హర్‌ప్రీత్ కౌర్ ప్రపంచ బ్యాంకు అధికారిణిగా పరిచయం చేశాడు. వీరిద్దరితో పాటు మరికొందరిని సీమా ఇంటికి తీసుకెళ్లి వరల్డ్ బ్యాంక్ టీమ్‌గా పరిచయం చేశాడు. తన సహోద్యోగి కావడంతో అజిత్ సింగ్‌ను సీమా నమ్మేసింది. తన కూతురికి ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం వస్తుందనే ఆశతో రూ.40 లక్షలు అజిత్ సింగ్ చేతిలో పెట్టేసింది. 


డబ్బులు ఇచ్చిన తర్వాత సీమాకు అజిత్ సింగ్ అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో తను మోసపోయానని తెలుసుకున్న సీమా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఛీటింగ్‌తో పాట పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. అజిత్ సింగ్ ఇప్పటికే మరో కేసులో జైలులో ఉన్నాడు. మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

Updated Date - 2022-07-22T23:56:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising