ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: గ్రాండ్‌గా విడాకుల పార్టీ చేసుకున్న మహిళ.. ఆ పార్టీకి వచ్చిన వెయిటర్‌ను చూసి..

ABN, First Publish Date - 2022-08-02T21:42:31+05:30

ఆ మహిళ తన భర్త నుంచి విడాకులు తీసుకుంది.. ఆ ఆనందంలో విడాకుల పార్టీ (Divorce Party) ఏర్పాటు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ మహిళ తన భర్త నుంచి విడాకులు తీసుకుంది.. ఆ ఆనందంలో విడాకుల పార్టీ (Divorce Party) ఏర్పాటు చేసింది.. బంధుమిత్రులందరినీ పిలిచి గ్రాండ్ పార్టీ ఇచ్చింది.. అతిథులందరికీ భోజనం వడ్డించడానికి వచ్చిన ఓ వెయిటర్‌ (Woman Falls In Love With Waiter) ఆమె మనసుకు విపరీతంగా నచ్చాడు.. ఓ ఏడాది పాటు అతడితో డేటింగ్ చేసింది.. ఓ కూతురు కూడా పుట్టిన తర్వాత వారిద్దరూ తాజాగా ఒక్కటయ్యారు.. వీరిద్దరి లవ్‌స్టోర్ సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral News) మారింది. ఆస్ట్రేలియా (Australia) కు చెందిన గాబ్రియెల్లా లాండోల్ఫీ అనే మహిళ తన విడాకుల వేడుకను జరుపుకోవడానికి పార్టీని నిర్వహించింది. 


ఇది కూడా చదవండి..

Chicken Pakodi: చిచ్చు పెట్టిన చికెన్ పకోడీ.. భార్యపై దాడి చేసిన భర్త.. ఆ తర్వాత అతను ఎంత పని చేశాడంటే..


తన భర్త నుంచి విడాకులు తీసుకున్న సందర్భంగా ఘనంగా వేడుకను జరుపుకోవాలని గాబ్రియెల్లా భావించింది. ఓ భారీ విడాకుల పార్టీ ఏర్పాటు చేసింది. ఎంతోమంది ఆ పార్టీకి వచ్చారు. ఆ పార్టీలో సర్వ్ చేయడానికి వచ్చిన జాన్ అనే వెయిటర్‌ ఆమెకు నచ్చాడు. పార్టీ ముగిసిన తర్వాతి రోజు జాన్.. గాబ్రియెల్లాకు ఫోన్ చేసి పార్టీలో ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత వారి మధ్య సంభాషణ ప్రారంభమైంది. ఆ తరువాత వాళ్లు కలుసుకోవడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. 


ఇద్దరూ డేటింగ్ ప్రారంభించారు. ఒక సంవత్సరం డేటింగ్ తర్వాత గాబ్రియెల్లాకు జాన్ ప్రపోజ్ చేశాడు. 2020 డిసెంబర్‌లో వీరికి ఓ కూతురు పుట్టింది. తాజాగా వీరిద్దరూ ఒక్కటయ్యారు. వీరి ప్రేమకథ, పెళ్లి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Updated Date - 2022-08-02T21:42:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising