ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రికెట్ బ్యాట్‌తో భర్తను చితక్కొట్టిన భార్య.. కారణమేంటో తెలిస్తే షాక్!

ABN, First Publish Date - 2022-07-14T02:36:28+05:30

రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి తనను కొడుతున్నాడని ఓ భార్య తన భర్తపై దాడి చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి తనను కొడుతున్నాడని ఓ భార్య తన భర్తపై దాడి చేసింది. క్రికెట్ బ్యాట్ తీసుకుని భర్తను చితక్కొట్టింది. దీంతో ఆ భర్త తలకు 17 కుట్లు పడ్డాయి. ఇద్దరూ ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Madya Pradesh: బాలుడిని మింగిన మొసలి.. వెంటనే గ్రామస్తులు దానిని పట్టుకుని ఏం చేశారంటే..


బికనీర్ నగరానికి సమీపంలో ఉన్న రిద్మల్సర్ గ్రామానికి చెందిన అమీన్ (35), అనీషా (30) దంపతులు కొద్ది రోజులుగా గొడవలు పడుతున్నారు. అమీన్ రోజూ మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యను కొడుతుండేవాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన అనీషా మంగళవారం రాత్రి తీవ్రంగా ప్రతిస్పందించింది. తనను కొట్టడానికి వచ్చిన భర్తను కింద పడేసి క్రికెట్ బ్యాట్‌తో చితక్కొట్టింది. దీంతో అతడి తల పగిలి రక్తస్రావం అయింది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అమీన్‌ను హాస్పిటల్‌కు తరలించారు.


హాస్పిటల్‌లో వైద్యులు అమీన్‌ తలకు 17 కుట్లు వేశారు. కోలుకున్న అమీన్ తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనీషా కూడా భర్తపై గృహహింస కేసు పెట్టింది. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఇద్దరినీ పిలిచి మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. 

Updated Date - 2022-07-14T02:36:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising