Madya Pradesh: బాలుడిని మింగిన మొసలి.. వెంటనే గ్రామస్తులు దానిని పట్టుకుని ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2022-07-13T22:56:50+05:30 IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు నదులు, చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి.

Madya Pradesh: బాలుడిని మింగిన మొసలి.. వెంటనే గ్రామస్తులు దానిని పట్టుకుని ఏం చేశారంటే..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు నదులు, చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. వరద నీటితో పాటు మొసళ్లు, పాములు వంటివి చెరువుల్లోకి కొట్టుకుని వస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు అంతర్ సింగ్ చెరువులో స్నానం చేయడానికి వెళ్లి Crocodile నోటికి చిక్కాడు. బాలుడి కాళ్లను పట్టుకున్న మొసలి నీళ్లలోనికి లాక్కెళ్లింది. ఆ ఘటనను చూసిన పిల్లలు.. స్థానికులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కొంత మంది పడవలతో చెరువులోకి వెళ్లి మొసలిని వల సహాయంతో బంధించి ఒడ్డుకు తీసుకొచ్చారు. 


బాలుడిని మొసలి నమలకూడదనే ఉద్దేశంతో దాని నోటి మధ్యలో ఒక కర్రను ఇరికించారు. ఏడు గంటల పాటు మొసలిని ఒడ్డునే ఉంచి రకరకాల ప్రయత్నాలు చేశారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. మొసలి మింగగానే బాలుడు చనిపోయి ఉంటాడని నచ్చ చెప్పారు. మొసలిని వారి నుంచి విడిపించి వేరే చోట వదిలేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Updated Date - 2022-07-13T22:56:50+05:30 IST