ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లయిన నెలకే భర్తను వదిలేసిన భార్య.. 4 ఏళ్ల తర్వాత మృతి.. ఆత్మహత్య అనుకున్న పోలీసులకే 6 రోజుల తర్వాత మైండ్‌బ్లాక్..!

ABN, First Publish Date - 2022-09-16T23:34:41+05:30

ఆ మహిళకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.. పెళ్లైన నెలకే భర్తను వదిలేసి వెళ్లిపోయింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ మహిళకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.. పెళ్లైన నెలకే భర్తను వదిలేసి వెళ్లిపోయింది.. తన తండ్రి దగ్గర కారు డ్రైవర్‌గా పని చేసే వ్యక్తితో సహజీవనం ప్రారంభించింది.. నాలుగేళ్లుగా అతడితోనే కలిసి ఉంటోంది.. ప్రభుత్వోద్యోగి అయిన ఆమె వారం రోజుల క్రితం మరణించింది.. ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని కుటుంబ సభ్యులు, పోలీసులు భావించారు.. అయితే పోస్ట్‌మార్టమ్ నివేదిక ఆధారంగా ఆమెది హత్య అని తేలింది.. చివరకు ప్రియుడి చేతిలోనే ఆమె హతమైనట్టు బయటపడింది. 


ఇది కూడా చదవండి..

14 ఏళ్ల కూతురికి 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి.. డబ్బు కోసం ఆశపడ్డ ఓ తండ్రి నిర్వాకమిదీ.. 9 నెలల తర్వాత..


రాజస్థాన్‌ (Rajasthan)లోని జోధ్‌పూర్‌కు చెందిన సరిత (30) అనే మహిళ ఉమైద్ ఆసుపత్రిలో జీఎన్‌ఎంగా పని చేస్తోంది. నాలుగేళ్ల క్రితం ఆమెకు అనిల్ అగర్వాల్ అనే వ్యక్తితో వివాహమైంది. అయితే పెళ్లైన నెలకే ఆమె భర్త నుంచి విడిపోయింది. తన తండ్రి దగ్గర డ్రైవర్‌గా పని చేసే హరీష్ మాలి(38)తో సహజీవనం ప్రారంభించింది. నాలుగేళ్లుగా వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి నివసిస్తున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి సరిత ఇంటికి వెళ్లేసరికి హరీష్ మద్యం మత్తులో ఉన్నాడు. ఆ సమయంలో వారి మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. విషయం తీవ్రస్థాయికి చేరడంతో సరితను హరీష్ గొంతుకోసి హత్య చేశాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆత్మహత్య కథనం రూపొందించాడు.


సమాచారం అందుకున్న పోలీసులు మొదట సరితది ఆత్మహత్యే అనుకున్నారు. అయితే పోస్ట్‌మార్టమ్‌ నివేదిక ద్వారా సరితను గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు హరీష్‌ను గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. మద్యం మత్తులో తానే సరితను హత్య చేసినట్టు హరీష్ అంగీకరించాడు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. 

Updated Date - 2022-09-16T23:34:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising