ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త కనిపించడం లేదంటూ ఓ భార్య ఫిర్యాదు.. కంగారుగా కనిపించడంతో పోలీసులకు డౌట్.. ఆమె ఫోన్‌కాల్ డేటాను చెక్ చేస్తే..

ABN, First Publish Date - 2022-07-04T22:08:03+05:30

ఆ మహిళ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.. తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ మహిళ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.. తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది.. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.. ఆమె చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో పోలీసులకు ఆమె మీద అనుమానం మొదలైంది.. ఆమె ఫోన్‌కాల్ పరిశీలించగా అసలు విషయం బయటపడింది.. ప్రియుడితో కలిసి ఆమె భర్తను హత్య చేసినట్టు తేలింది.. దీంతో పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

నాన్నా.. వీళ్లు నన్ను బతకనివ్వరు.. వచ్చి తీసుకెళ్లిపో.. అంటూ తండ్రికి ఓ కూతురి నుంచి ఫోన్ కాల్.. చివరకు..


దామోహ్‌‌కు సమీపంలోని మిర్జాపూర్ గ్రామానికి చెందిన సావిత్రి పటేల్ (36) జూన్ 28న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త బల్లూ పటేల్ (37) రాత్రి నుంచి ఇంటికి రాలేదని పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ తర్వాతి రోజు మధ్యాహ్నం పొలంలో బల్లు మృతదేహం లభ్యమైంది. పోలీసులు బల్లు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించి దర్యాప్తు ప్రారంభించారు. సావిత్రిని కూడా పోలీసులు ప్రశ్నించారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఆమె తరచూ తన స్టేట్‌మెంట్‌ను మారుస్తూ వచ్చింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. సావిత్రి ఫోన్ కాల్ డేటాను పరిశీలించి ఆమె తరచుగా హల్లె రక్వార్ అనే వ్యక్తితో మాట్లాడినట్టు తెలుసుకున్నారు. 


సావిత్రిని, హల్లె రక్వార్‌ను విడివిడిగా తమదైన శైలిలో విచారించారు. దీంతో హల్లె రక్వార్ పోలీసుల ముందు నిజం అంగీకరించాడు. హల్లె, సావిత్రి మధ్య నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. బల్లు మద్యానికి బానిస. రోజూ మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యను, పిల్లలను కొట్టేవాడు. దీంతో భర్తపై విముఖత పెంచుకున్న సావిత్రి.. హల్లెకు దగ్గరైంది. సావిత్రి, హల్లె కలిసి జీవించాలని కోరుకున్నారు. అందుకు బల్లు అడ్డంకిగా మారడంతో అతడిని చంపాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి బల్లూ గొంతు కోసి చంపేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సావిత్రి, హల్లెను రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2022-07-04T22:08:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising