నాన్నా.. వీళ్లు నన్ను బతకనివ్వరు.. వచ్చి తీసుకెళ్లిపో.. అంటూ తండ్రికి ఓ కూతురి నుంచి ఫోన్ కాల్.. చివరకు..

ABN , First Publish Date - 2022-07-04T20:43:58+05:30 IST

`నాన్నా.. ఈ నలుగురు నన్ను కొట్టి చంపేస్తున్నారు.. నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్లిపో.. ఆలస్యమైతే నేను ప్రాణాలతో ఉండను`

నాన్నా.. వీళ్లు నన్ను బతకనివ్వరు.. వచ్చి తీసుకెళ్లిపో.. అంటూ తండ్రికి ఓ కూతురి నుంచి ఫోన్ కాల్.. చివరకు..

`నాన్నా.. ఈ నలుగురు నన్ను కొట్టి చంపేస్తున్నారు.. నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్లిపో.. ఆలస్యమైతే నేను ప్రాణాలతో ఉండను` అంటూ ఆ మహిళ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. కూతురి అత్తింటికి వెళ్లేందుకు బయల్దేరుతుండగానే తండ్రికి ఫోన్ వచ్చింది. నదిలో దూకి కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలిసింది. తీవ్ర విషాదంలో కూరుకుపోయిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు సమీపంలో ఏడు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 


ఇది కూడా చదవండి..

Shocking.. ఇతర మహిళలకు భర్తను అద్దెకిస్తానంటున్న భార్య.. కారణమేంటో తెలిస్తే..


రాజస్థాన్‌లోని అళ్వార్‌కు చెందిన మధుబాల (29) సూరత్‌గఢ్ థర్మల్ ప్లాంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త తరుణ్ (32) బీహార్‌లోని పాట్నాలో కాంపౌండర్. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో వివిధ రాష్ట్రాల్లో పని చేస్తున్నారు. భర్త వేరే రాష్ట్రంలో ఉండడంతో మధుబాల తన ఏడాదిన్నర కూతురితో కలిసి అత్తమామల వద్ద ఉండేది. అయితే మధుబాల జీతం కోసం అత్తమామలు ఆమెను వేధించేవారు. జీతం మొత్తం తెచ్చి తమకు ఇవ్వాలని గొడవపడేవారు. ఆమె మాట వినకపోతే కొట్టేవారు. గత నెలలో తన అత్తమామల ప్రవర్తన విషయమై తండ్రికి మధుబాల ఫోన్ చేసి చెప్పింది. వెంటనే అతను వెళ్లి అడిగాడు.


అప్పుడు మధుబాల తండ్రికి అత్తమామలు క్షమాపణలు చెప్పారు. ఇకపై అలా జరగదని హామీ ఇచ్చారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. గత నెల 25వ తేదీన మధుబాలను తీవ్రంగా కొట్టారు. చెప్పుతో 30, 40 సార్లు కొట్టారు. దీంతో ఆమె తండ్రికి ఫోన్ చేసి వెంటనే రావాలని అడిగింది. కొద్దిసేపటికే నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. ఆమె శరీరంపై గాయాలున్నాయని తేలింది. మధుబాల తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె అత్తమామలను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. 

Updated Date - 2022-07-04T20:43:58+05:30 IST