Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 03 Jul 2022 15:45:21 IST

Shocking.. ఇతర మహిళలకు భర్తను అద్దెకిస్తానంటున్న భార్య.. కారణమేంటో తెలిస్తే..

twitter-iconwatsapp-iconfb-icon
Shocking.. ఇతర మహిళలకు భర్తను అద్దెకిస్తానంటున్న భార్య.. కారణమేంటో తెలిస్తే..

బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ తన భర్తను అద్దెకు ఇచ్చి డబ్బులు సంపాదిస్తోంది.. ఆశ్చర్యపోకండి.. ఆమె తన భర్తను అద్దెకిచ్చేది ఇంటి పనుల కోసం మాత్రమే.. ఇల్లు రిపేర్, అలంకరణ, చిన్న చిన్న వస్తువులు పాడైతే బాగు చేయడం, గార్డెనింగ్ వంటి పనులు చేయడంలో ఆమె భర్తకు మంచి నైపుణ్యం ఉందట.. చాలా తక్కువ డబ్బులు తీసుకుని అతను ఆ పనులన్నింటినీ చేసిపెడతాడట.. అందుకే ఆమె తన భర్తను సాటి మహిళలకు అద్దెకు ఇస్తుందట.. ఆమె `Rent My Handy Husband` పేరుతో ఓ వైబ్‌సైట్ కూడా ప్రారంభించింది.. ఎవరికైనా ఆమె భర్త కావాలంటే ఆ వైబ్‌సైట్ ద్వారా సంప్రదించాలట. 


ఇది కూడా చదవండి..

జుట్టు ఊడిపోతోందని యువతి షాకింగ్ నిర్ణయం.. మైసూర్‌లో దారుణ ఘటన..!

యూకేలోని బకింగ్‌హామ్‌ షైర్‌కు చెందిన లారా యంగ్‌కు ముగ్గురు పిల్లలు. ఆమె భర్త జేమ్స్‌ ఇంతకు ముందు వేర్‌హౌజ్‌లో పనిచేసేవాడు. ఆటిజంతో బాధపడుతున్న ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి భార్య ఇబ్బంది పడటం చూసి ఉద్యోగం మానేశాడు. ఇంటి దగ్గరే ఆమెకు సహాయంగా ఉండేవాడు. కార్పెంట్ వర్క్, పెయింటింగ్, టైల్స్ ఫిక్సింగ్ వంటి పనుల్లో నిపుణుడైన జేమ్స్ ఇంటి దగ్గర ఖాళీగా ఉండేవాడు. ఆ తర్వాత తన నైపుణ్యంతో ఇంటిని సరికొత్తగా మార్చేశాడు. ఆ తర్వాత బంధువులు, స్నేహితుల ఇళ్లను కూడా అలాగే వారి వారి అభిరుచులకు తగ్గట్టు పునర్నిర్మించాడు. దీంతో లారాకు ఓ ఐడియా వచ్చింది. 


జేమ్స్‌ చేత పార్ట్‌ టైమ్‌ వర్క్‌ చేయించాలని అనుకుంది. తమ ఆర్థిక కష్టాలు కూడా తీరుతాయని ప్లాన్ వేసింది. `Rent My Handy Husband` పేరుతో ఓ వైబ్‌సైట్  ప్రారంభించి సోషల్ మీడియా ద్వారా దానిని ప్రమోట్ చేసింది. తన భర్త కార్పెంట్ వర్క్, పెయింటింగ్, గార్డెనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ వంటి పనుల్లో నిపుణుడని, ఎవరికైనా అసరముంటే సంప్రదించవచ్చని ప్రకటన ఇచ్చింది. అవసరమున్న కొందరు ఆసక్తి చూపారు. తక్కువ ఖర్చుతో ఇతరులకు సహాయం చేసి తాము  ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకుంటున్నామని లారా చెబుతోంది.   

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.